Heavy rain alerts: తెలంగాణ వ్యాప్తంగా ఉపరితల ద్రోణి ప్రభావం వల్ల భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాతావరణ కేంద్రం కూడా రెడ్ అలర్ట్ ను జారీచేసింది.
దేశంలో అనేక చోట్ల కొన్నిరోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే ప్రాజెక్టులన్ని నిండుకుండలను తలపిస్తున్నాయి. చెరువులు,నదులు కూడా పొంగిపోర్లుతున్నాయి. ప్రాజెక్టులలో నీళ్లు చేరుతుండంతో అధికారులు గేట్లు ఓపెన్ చేసి మరీ దిగువకు నీళ్లు వదిలిపెడుతున్నారు.
ఇదిలా ఉండగా.. తెలంగాణకు వాతావరణ కేంద్ర రెడ్ అలర్ట్ ను జారీ చేసింది. అనేక చోట్ల కుండపోతగా వర్షం కురుస్తుంది. ఇక హైదరబాద్ విషయానికి వస్తే.. కాలనీలు, రోడ్లన్ని చెరువుల్ని తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలన్ని జలమయమయ్యయి. ఎక్కడ చూసిన నీళ్లు కన్పిస్తున్నాయి.
హుస్సెన్ సాగర్ సైతం నిండిపోయింది. మరోవైపు భాగ్యనగర వాసులు కుండపోతగా కురుస్తున్న వర్షంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడ నీళ్లున్నాయో.. ఎక్కడ మ్యాన్ హోల్స్ ఉన్నాయో.. కూడా అర్ధంకానీ పరిస్థితి నెలకొంది. చాలా మంది టూవీలర్ ప్రయాణికులు రోడ్డుప్రమాదాలకు గురైను ఘటనలు వార్తలలో నిలిచాయి.
అదే విధంగా గత వారంరోజులుగా హైదరాబాద్ నగరవాసుల్ని వర్షం చుక్కలు చూపిస్తుంది. ఉదయంపూట, సాయంత్రం పూట భారీగా వర్షం పడుతుంది. ముఖ్యంగా ఆఫీసులు, స్కూళ్లకు వెళ్తున్న వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
వాతావరణ కేంద్రం రెడ్ అలర్ట్ తో జీహెచ్ఎంసీ అధికారులు సైతం అప్రమత్తమైంది. అత్యవసరమైతే తప్ప బైటకు రావొద్దని కూడా తెల్చిచెప్పింది. అంతేకాకుండా.. పిల్లలు , పెద్దలు విద్యుత్ స్థంబాల దగ్గరకు వెళ్లొద్దని సూచనలు చేసింది. ఎక్కడైన విద్యుత్ వయర్లు కింద పడిన వెంటనే అధికారులకు చెప్పాలని కూడా చెప్పింది.
నగర వ్యాప్తంగా కుండపొతగా వర్షం కురుస్తుంది. ఈ క్రమంలో జీహెచ్ఎంసీ డిజాస్టర్ ఫోర్స్ అధికారులు అత్యవసరం సమయంలో సంప్రదించాలని ఫోన్ నంబర్లను కూడా వెల్లడించారు. ముఖ్యంగా హైదరాబాద్ లో ఉంటే ప్రజలు.. అత్యవసరమైతేనే బయటకు రావాలంటూ అధికారులు హెచ్చరించారు. ఏదైనా అనుకోని విపత్తు సంభవిస్తే వెంటనే 040-21111111, 9000113667 నంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు.