Allu Arjun Recent Movies Business: అల్లు అర్జున్..ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తో సినీ ఎంట్రీ ఇచ్చినా.. ఆ తర్వాత తన కంటూ సెపరేట్ ఇమేజ్ సంపాదించుకున్నాడు. అంతేకాదు పుష్ప చిత్రంతో ప్యాన్ ఇండియా స్టార్ అయ్యాడు.అంతేకాదు తెలుగు నుంచి తొలి జాతీయ అవార్డు అందుకున్న హీరోగా రికార్డులకు ఎక్కాడు. మరికొన్ని గంటల్లో పుష్ప 2 మూవీతో పలకరించబోతున్నాడు.ఈ సందర్భంగా అల్లు అర్జున్ రీసెంట్ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికొస్తే..
ఇంతింతై అన్నట్టు.. సినిమా సినిమాకు తన మార్కెట్ పరిధి పెంచుకుంటూ పోతున్నాడు అల్లు అర్జున్. పుష్ప తో నేషనల్ లెవల్లో క్రేజ్ తెచ్చుకున్న అల్లు అర్జున్.. పుష్ప2తో మరికొన్ని గంటల్లో పలకరించబోతున్నాడు. పుష్ప 2తో రెమ్యునరేషన్ తో పాటు ప్రీ రిలీజ్ బిజినెస్ లో అన్ని రికార్డులు చెరిపేసాడు అల్లు అర్జున్. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ రీసెంట్ మూవీస్ ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికొస్తే..
పుష్ప 2 ది రూల్.. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కిన చిత్రం ‘పుష్ప 2 ది రూల్’. ఈ మూవీ తెలుగు సహా మన దేశంలోనే ఎక్కువ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన సినిమాగా రికార్డులకు ఎక్కింది. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ. 617 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. తెలుగులోనే రూ. 213 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేయడం విశేషం. ఒక రకంగా ఇది రికార్డు బిజినెస్ అని చెప్పాలి.
పుష్ఫ పార్ట్ -1 ది రైజ్.. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘పుష్ప పార్ట్ -1’. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా వరల్డ్ వైడ్ గా రూ. 144.9 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.ఇక తెలంగాణ, ఏపీలో కలిపి రూ. 101.75 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
అల వైకుంఠపురములో .. అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో యాక్ట్ చేసిన చిత్రం ‘అల వైకుంఠపురములో’. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ గా నిలవడమే కాదు. అంతేకాదు బన్ని కెరీర్‌లో డిఫరెంట్ మూవీగా నిలిచిపోయింది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 84.34 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.
నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా.. అల్లు అర్జున్ హీరోగా వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ . ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ. 76 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.
దువ్వాడ జగన్నాథం (DJ).. హరీష్ శంకర్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన చిత్రం ‘దువ్వాడ జగన్నాథం’. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 79 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.
సరైనోడు.. అల్లు అర్జున్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో అల్లు అరవింద్ నిర్మాణంలో తెరకెక్కిన సినిమా ‘సరైనోడు’. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ. 54 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.
సన్నాఫ్ సత్యమూర్తి.. త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన చిత్రం ‘సన్నాఫ్ సత్యమూర్తి’. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ. 54 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.