Hyderabad Bonalu 2024: ఆషాఢ మాసం బోనాల చివరి ఘట్టం.. లాల్ దర్వాజా సింహ వాహిని ఆలయం ఎంతో ప్రత్యేకం..

Hyderabad Lal darwaza Bonalu 2024: ఆషాఢమాసంలో బోనాలకు ప్రత్యేకం. ఈ మాసంలో గ్రామదేవతలు అమ్మవార్లకు బోనాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే, ఈ బోనాలు చివరిఘట్టానికి చేరుకున్నాయి. రేపు జూలై 28 లాల్‌దర్వాజ సింహవాహిని అమ్మవారి బోనాలు నిర్వహించనున్నారు. ఆ వివరాలు తెలుసుకుందాం.
 

1 /5

ఆషాఢమాసం మొదలు రాగానే మొదట గోల్కొండ బోనాలు ప్రతి ఏడాది ప్రారంభమవుతాయి. ఇక రెండో బోనం బల్కంపేట ఎల్లమ్మకు సమర్పిస్తారు. ఇదే మాసంలో మూడో ఆదివారం సికింద్రాబాద్‌ ఉజ్జయినీ మహంకాళికి బోనం సమర్పిస్తారు. చివరగా హైదరాబాద్‌ లాల్‌ దర్వాజా సింహవాహిన అమ్మవార్లకు బోనం సమర్పించడంతో ఉత్సవాలు పూర్తవుతాయి.  

2 /5

రేపు ఆదివారం ప్రత్యేకత లాల్‌దర్వాజ సింహవాహిని అమ్మవారి బోనాలు, ఈ అమ్మవార్లు ఎంతో మహిళ గలవారు గత 116 ఏళ్లుగా ఇక్కడ బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. అంతేకాదు ఈ సింహవాహినీ అమ్మవారు భక్తుల కోరికలు తీర్చే కొంగుబంగారంగా మారుస్తుంది.   

3 /5

ఈ నేపథ్యంలో ప్రతి ఏడాది ఇక్కడకు చాలామంది భక్తులు చేరుకుంటారు. చివరి ఆషాఢమాసం ఆదివారం లాల్‌దర్వాజలో ప్రత్యేక ఏర్పాట్లు చేసి బోనాల ఉత్సవాలు జరుపుతారు. ఆ తర్వాత అమ్మవారిని అంబారీపై ఊరేగిస్తారు. మూసీ నదిలో అమ్మవారి విగ్రహ నిమజ్జనం కూడా ఉంటుంది.  

4 /5

లాల్‌దర్వాజ సింహవాహిని ఆలయం 1907 లో నిర్మించారు. ఈ ప్రాంతానికి ప్రవేశ ద్వారం ఒక పెద్ద ఎర్ర తలుపు ఉండేది అప్పటి నిజాం కాలం నుంచి దీన్ని లాల్‌ దర్వాజ అని పేరుతో పిలుస్తున్నారు. ఈ ఆలయం చార్మినార్‌కు దగ్గర్లో ఉంటుంది. ఇక ప్రధానంగా అఫ్జల్‌ గంజ్‌, సీబీఎస్‌ నుంచి బస్సులు కూడా ఉన్నాయి.  

5 /5

ప్రత్యేకంగా హైదరాబాద్‌ బోనాలు చివరిగా రానున్నాయి. ఈ నేపథ్యంలో ఎంతో కట్టుదిట్టంగా, అట్టహాసంగా కూడా ఏర్పాట్లు చేస్తారు. భక్తులు భక్తిశ్రద్ధలతో అమ్మవార్లకు అన్నం, ఆకుకూర, బెల్లం అన్నం వంటివి వండుకుని తీసుకువస్తారు. అంతేకాదు ఈ అమ్మవారికి చీర, ఒడిబియ్యం కూడా సమర్పిస్తారు.