Himayatsagar And Osmansagar Gates Lifted: నిలకడగా వరద పోటెత్తుతుండడంతో హైదరాబాద్‌కు ప్రధాన నీటి వనరులైన హిమాయత్, ఉస్మాన్ సాగర్ల గేట్లు మరోసారి తెరచుకున్నాయి.
జంట జలాశయాలు: హైదరాబాద్‌కు ప్రధాన నీటి వనరులు హిమాయత్ సాగర్, హిమాయత్ సాగర్. మూసీ నదిపై ఉన్న ఈ ప్రాజెక్టులకు వరుసగా వరద ప్రవాహం పెరుగుతోంది.
పరవళ్లు: వరద నిలకడగా కొనసాగుతుండడంతో గేట్లు ఎత్తి నీటిని విడుదల చేయడంతో మూసీ పరవళ్లు తొక్కుతోంది.
నిండుకున్న జలాశయాలు: కొన్ని రోజులుగా మోస్తరు వర్షాలకు హిమాయత్ సాగర్, ఒస్మాన్ సాగర్ రిజర్వాయర్లు పూర్తిగా నిండుకున్నాయి.
నీటి విడుదల: హిమాయత్ సాగర్ 3 గేట్లు, ఉస్మాన్ సాగర్ 6 గేట్లను రెండు ఫీట్ల మేరకు ఎత్తారు. మొత్తం 3,488 క్యూసెక్కులు మూసీలోకి జలమండలి అధికారులు నీటిని విడుదల చేశారు.
ఔట్ ఫ్లో ఇన్ ఫ్లో: హిమాయత్ సాగర్ ఇన్‌ఫ్లో 350 క్యూసెక్కులు ఉండగా.. 2,060 క్యూసెక్కులు ఔట్ ఫ్లో ఉంది.
నిలకడగా వరద: ఉస్మాన్ సాగర్ ఇన్‌ఫ్లో 1,400 క్యూసెక్కులు కొనసాగుతుండగా.. 1,428 క్యూసెక్కులు ఔట్‌ఫ్లో విడుదల చేశారు.
హెచ్చరిక: గేట్లు ఎత్తి నీటిని విడుదల చేయడంతో దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జలమండలి అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.