Chicken Ghee Roast: నోరు ఊరించే చికెన్‌ ఘీ రోస్ట్‌.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకునే విధానం..

Chicken Ghee Roast Recipe: చికెన్‌ ఘీ రోస్ట్‌ మంగళూరు స్టైల్‌ రిసిపీ, ఇందులో రకరకాల మసాలాలు వేసి తయారు చేసుకుంటారు. చికెన్‌ అంటేనే రకరకాల వెరైటీలు తయారు చేసుకోవచ్చు. చికెన్‌ రిసిపీలు ఎంతో రుచికరంగా ఉంటాయి. ఇది చికెన్‌ గ్రేవీ లేదా డ్రై గా కాకుండా ఉంటుంది. ఈ రిసిపీ నోరూరించేలా ఉంటుంది. 
 

1 /6

చికెన్‌ -1 కేజీ పసుపు-1/2 Tbsp నిమ్మరసం-1 Tbsp నెయ్యి-6 Tbsp కారంపొడి- 2 Tbsp జిలకర్ర పొడి-1/2 Tbsp మెంతి ఆకులు- 1/4 Tbsp

2 /6

చింతపండు పేస్ట్‌ -1 1/2 Tbsp పెరుగు-1/2 కప్పు కరివేపాకు ఎండుమిర్చి-8 బెల్లం- 2 Tbsp మిరియాలు- Tbsp ధనియాల పొడి- 1 1/4 Tbsp వెల్లుల్లి- 3 రెబ్బలు ఉప్పు -రుచికసరిపడా

3 /6

చికెన్‌ ఘీ రోస్ట్‌ తయారీ విధానం.. ఒక గిన్నె తీసుకుని చికెన్‌ వేసుకుని ఒక టీ స్పూన్‌ కారం, పెరుగు, పసుపు, ఉప్పు, నిమ్మరసం వేసి మ్యారినేట్‌ చేసుకోవాలి. దీన్ని ఓ గంటపాటు ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి.

4 /6

ఇప్పుడు ఒక ప్యాన్‌ తీసుకుని అందులో జిలకర్ర, ధనియాలు, లవంగం, మిరియాలు వేసి వేయించుకోవాలి. మీడియం మంటపై సువాసన వచ్చే వరకు వేయించుకోవాలి. దీన్ని సన్నగా బ్లెండ్‌ చేసుకోవాలి. ఇందులో ఇతర మసాలాలు, ఎండుమిర్చి, చింతపండు పేస్ట్‌, వెల్లుల్లి కూడా వేసి గ్రైండ్‌ చేయాలి.  

5 /6

ఇప్పుడు ఒక కడాయి తీసుకుని అందులో మూడు చెంచాల ఘీ వేసి వేడి చేయాలి. ఈ మ్యారినేట్‌ చేసిన చికెన్‌ కూడా అందులో వేసి వేయించుకోవాలి. చికెన్ మూడు వంతులు ఉడికిన తర్వాత చికెన్‌ తీసి పక్కన బెట్టుకోవాలి. అందులోనే మిగతా నెయ్యి కూడా వేసి బ్లెండ్‌ చేసిన మిశ్రమాన్ని వేసి బాగా కలపాలి. ఇందులో నుంచి ఆయిల్‌ సెపరేట్‌ అవ్వాలి.   

6 /6

ఇందులోనే చికెన్‌ ముక్కలు, బెల్లం కూడా వేసి కలపాలి. ఆ తర్వాత రెండు స్పూన్ల నీరు, ఉప్పు కూడా వేసి బాగా కలపాలి. ఇప్పుడు మూత పెట్టి మరో 10 నిమిషాలు సన్నని మంటపై ఉడికించుకోవాలి. మూత తీసి మరో రెండు నిమిషాలపాటు మూత తీసి ఉడికించుకోవాలి. ఇప్పుడు ఘీ రోస్ట్‌ చికెన్‌ రెడీ అవుతుంది. కరివేపాకు వేసి గార్నిష్‌ చేసుకుంటే చికెన్‌ ఘీ రోస్ట్‌ రెడీ అయినట్లే..