Honor 90 5G Price: అమెజాన్‌లో Honor 90 5G మొబైల్‌పై బంఫర్‌ ఆఫర్‌..40 శాతం తగ్గింపుతో మీ కోసం..

Honor 90 5G Price Cut: ప్రముఖ ఈ కామర్స్‌ కంపెనీ అమెజాన్‌లో Honor 90 5G స్మార్ట్‌ ఫోన్‌పై ప్రత్యేక తగ్గింపు ఆఫర్స్‌ నడుస్తున్నాయి. ఈ ఆఫర్స్‌లో భాగంగా మీరు మొబైల్‌ను కొనుగోలు చేస్తే దాదాపు రూ.3000 వరకు తగ్గింపు లభిస్తుంది. అయితే ఈ స్మార్ట్‌ ఫోన్‌కి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

  • Sep 25, 2023, 12:40 PM IST


Honor 90 5G Price Cut: యువత ఎక్కువగా హై మెగాపిక్సెల్ కెమెరా కలిగిన స్మార్ట్ ఫోన్స్‌ను కొనుగోలు చేసేందుకు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. అయితే ఇలాంటి వారికే ఇటీవలే హానర్ ఓ స్మార్ట్‌ ఫోన్‌ను విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్‌ ప్రస్తుతం మార్కెట్‌లో Honor 90 5G పేరుతో లభిస్తోంది. ఈ మొబైల్‌ ఫోన్‌  200 మెగాపిక్సెల్ కెమెరాను కలిగి ఉంటుంది. అయితే ఈ స్మార్ట్‌ ఫోన్‌కి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
 

1 /5

ప్రస్తుతం కంపెనీ ఈ Honor 90 5G స్మార్ట్‌ఫోన్‌ ప్రముఖ ఈ కామర్స్‌ కంపెనీ అమెజాన్‌లో విక్రయిస్తోంది. ఇది అమెజాన్‌లో MRP ధరతో రూ.47,999 అందుబాటులో ఉంది. అయితే ఆఫర్స్‌లో భాగంగా ఈ స్మార్ట్‌ ఫోన్‌ 21 శాతం తగ్గింపుతో రూ. 37,999కే లభిస్తోంది.   

2 /5

ఈ Honor 90 5G మొబైల్‌పై మరింత తగ్గింపు పొందడానికి బ్యాంకు ఆఫర్స్‌ను కూడా అందిస్తోంది. ఈ ఆఫర్స్‌లో భాగంగా ICICI బ్యాంకు క్రెడిట్‌ కార్డ్‌ను వినియోగించి కొనుగోలు చేస్తే దాదాపు రూ.3000 వరకు తగ్గింపు లభిస్తుంది.  

3 /5

అంతేకాకుండా అమెజాన్‌లో ఈ మొబైల్‌ను SBI బ్యాంకు క్రెడిట్‌ కార్డ్‌తో కొనుగోలు చేస్తే రూ.3000 వరకు తగ్గింపు పొందవచ్చు. దీంతో పాటు డెబిట్ కార్డ్‌పై కూడా మీరు ఈ తగ్గింపును పొందవచ్చు. 

4 /5

మీరు ఈ మొబైల్‌ను కొనుగోలు చేసే క్రమంలో OneCard క్రెడిట్‌ కార్డ్‌తో బిల్‌ చెల్లిస్తే రూ. 1000 వరకు తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా ఇదే సమయంలో మీరు వన్‌కార్డ్‌ ద్వారా EMI ఆప్షన్‌తో కొనుగోలు చేస్తే రూ. 750 వరకు అదనపు తగ్గింపును పొందవచ్చు. అంతేకాకుండా ఎక్చేంజ్‌ ఆఫర్స్‌లో భాగంగా రూ.35,550 వరకు తగ్గింపు పొందండి.  

5 /5

ఈ మొబైల్‌ 8GB + 256GB వేరియంట్స్‌లో లభిస్తోంది. ఇది 200MP అల్ట్రా-క్లియర్ మెయిన్ కెమెరాతో పాటు 12MP అల్ట్రా వైడ్, మాక్రో 2-ఇన్-1 కెమెరాను కలిగి ఉంటుంది. అంతేకాకుండా క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 Gen 1 యాక్సిలరేటెడ్ ఎడిషన్ 5G 4nm ప్రాసెసర్‌పై పని చేస్తుంది.