Home facial pack: ఎంతోమంది మొహం తెల్లగా కనిపివ్వడం కోసం ఏవేవో క్రిములు రాస్తూ ఉంటారు. అయితే ఇలా క్రీములు రాసేదానికన్నా.. ఇంట్లోనే ఎంచక్కా చేసుకునే ప్యాక్స్ వేసుకుంటే మొహానితో పాటు.. మన స్కిన్ కి కూడా ఎంతో మంచిది. మరి అలాంటి ఒక ప్యాక్ ని ఈరోజు చూద్దాం..
ఎంతోమంది మొహం తెల్లగా కనిపించడం కోసం.. బ్యూటీ పార్లర్ కి వెళ్లి.. వేలవేల రూపాయలు ఖర్చు చేసి ఫేషియల్ చేయించుకుంటారు. అయితే ఈ ఫేషియల్స్ వల్ల స్కిన్ కి ఎన్నో సమస్యలు రావచ్చు.
కొంతమందికి ఈ ఫేషియల్ పడకపోతే.. మొహం పైన పింపుల్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి. అంతేకాకుండా ఈ కెమికల్స్ వల్ల.. రోజులు గడిచే కొద్ది స్కిన్ కి సంబంధించిన ఎన్నో రోగాలు కూడా రావచ్చు.
ఇక ఫేషియల్స్ కాకుండా మొహం మెరిసిపోయేలా చేసుకోవడం ఎలా అని అనుమానం మీకు ఉంటే.. ఇప్పుడు చెప్పే ఒక ప్యాక్ ట్రై చేయండి. ఫేషియల్ కన్నా కూడా గ్లో.. మీ మొహం పై రావడం ఖాయం.
ఈ ఫేస్ ప్యాక్ తయారీ కోసం.. మీకు కావాల్సిందల్లా కొన్ని అవిసగించలు మాత్రమే. దాంతో పాటు కొంచెం తేనె, పెరుగు కూడా పక్కన పెట్టుకుంటే చాలు.. మీకు కావలసిన ఫేషియల్ ప్యాక్ ఇంట్లోనే చేసుకోవచ్చు.
ఇక ఈ తయారీ విధానం కోసం ముందుగా.. అర చెంచా అవిసె గింజలను మిక్సీలో వేసుకొని బాగా పొడి పట్టించి పక్కన పెట్టుకోండి. వీటిలో ఒక్క చుక్క కూడా నీళ్లు కలపద్దు.
ఇప్పుడు ముందుగా చేసి పెట్టుకున్న అవిసగింజల పొడిలో రెండు స్పూన్ల తేనెను కలిపి బాగా ముద్దలాగా చేసుకోండి. అందులోనే ఒక కప్పు పెరుగు కూడా కలుపుకోవాలి. అన్నింటినీ బాగా మిక్సీ కి వేశాక.. ఆ క్రీమ్ పక్కన తీసి పెట్టుకుంటే.. మీ ఫేస్ ప్యాక్ సిద్ధం అయిపోయినట్లే. దీన్ని నేరుగా ముఖానికి రాసుకుంటే చాలు.
దీనిని అలానే మొహం పైన ఒక 15 నిమిషాల పాటు వదిలేసి.. ఆ తరువాత చల్లని నీటితో మొహం కడుక్కునేయంది. ఇలా వారానికి మూడుసార్లు చేస్తే ఎంతో అందమైన మొహం మీ సొంతం.
గమనిక: పైన చెప్పిన సమాచారం కేవలం అధ్యయనాలు, నిపూణుల సలహాల మేరకు చెప్పినవి మాత్రమే. జీ దీనికే ఎటువంటి బాధ్యత వహించదు.