Hit Combinations: ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో కథ కంటే ముందు కాంబినేషన్‌కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక హీరో, దర్శకుడు కాంబినేషన్‌లో ఒక సినిమా సక్సెస్ అయితే వెంటనే ఆ కాంబినేషన్‌లో పలు సినిమాలు నిర్మించడానికి నిర్మాతలు క్యూ కడుతున్నారు. తాజాగా రంగస్థలం తర్వాత రామ్ చరణ్, సుకుమార్ కాంబో సెట్ అయింది. అటు వీళ్ల బాటలో బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, రవితేజ, అల్లు అర్జున్, ఎన్టీఆర్ వంటి హీరోలు తమకు గతంలో హిట్ ఇచ్చిన దర్శకులతో మరోసారి వర్క్ చేస్తున్నారు.
రామ్ చరణ్ - సుకుమార్.. రంగస్థలం వంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత రామ్ చరణ్, సుకుమార్ మరోసారి కలిసి పనిచేయబోతున్నారు. తాజాగా హోలి సందర్భంగా వీళ్ల కాంబినేషన్ సెట్ అయింది. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ ఈ సినిమాను సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు.
అల్లు అర్జున్ - సుకుమార్.. ఇప్పటికే అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో ఆర్య, ఆర్య2, పుష్ప వంటి సినిమాలు వచ్చాయి. అందులో ఆర్య 2 మాత్రమే సక్సెస్ కాలేదు. మిగతా సినిమాలన్ని హిట్ అనిపించుకున్నాయి. ఇపుడు వీళ్ల కాంబినేషన్‌లో పుష్ప 2 ది రూల్ రాబోతుంది. ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.
బాలకృష్ణ - బోయపాటి శ్రీను ఇప్పటికే బాలకృష్ణ, బోయపాటి శ్రీను కలయికలో సింహా, లెజెండ్, అఖండ వంటి హాట్రిక్ హిట్స్ ఉన్నాయి. ఇపుడు వీళ్ల కలయికలో అఖండ 2 రాబోతుంది. ఈ సినిమాను ఉగాది కానుకగా అఫీషియల్‌గా ప్రకటించనున్నారు.
పవన్ కళ్యాణ్ - హరీష్ శంకర్.. గబ్బర్ సింగ్ వంటి హిట్ బ్లాక్ బస్టర్ తర్వాత పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కలయికలో 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా రాబోతుంది. ఈ సినిమాపై సినీ ఇండస్ట్రీలో భారీ అంచనాలే ఉన్నాయి.
ఎన్టీఆర్ - కొరటాల శివ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో గతంలో 'జనతా గ్యారేజ్' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత మరోసారి దేవర సినిమా కోసం పనిచేస్తున్నారు. ఈ సినిమా ఈ యేడాదే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అంతేకాదు ఈ సినిమా తర్వాత దేవర 2 సినిమా రాబోతుంది.
రవితేజ - గోపిచంద్ మలినేని రవితేజ, గోపిచంద్ మలినేని కాంబినేషన్‌లో డాన్ శీను, బలుపు, క్రాక్ వంటి హాట్రిక్ హిట్స్ తర్వాత ఇపుడు నాల్గోసారి ఈ కాంబినేషన్‌కు రంగం సిద్ధం అయింది.