Hero Destini 125 Scooter At Just Rs.83,390: ప్రముఖ స్కూటర్ కంపెనీ హీరో నుంచి అద్భుతమైన స్కూటర్ ఆప్డేట్ వేరియంట్ మార్కెట్‌లోకి విడుదలైంది. ఇది అద్బుతమైన ఎన్నో ఫీచర్స్‌తో పాటు ప్రత్యేకమైన డిజైన్‌తో లాంచ్ అయ్యింది. ఈ హీరో పాపులర్ డెస్టినీ 125 స్కూటర్ ప్రత్యేకమైన ఇంజన్ సెటప్‌ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఎక్కువ మైలేజీతో అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ స్కూటర్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ హీరో డెస్టినీ 125 స్కూటర్ (Hero Destini 125 Scooter) అద్భుతమైన 124.6 సిసి ఎయిర్-కూల్డ్ ఇంజన్‌తో విడుదలైంది. అంతేకాకుండా ఈ స్కూటర్ లీటరుకు 60 కిమీ వరకు మైలేజీని అందిస్తుంది. దీంతో పాటు 5-లీటర్ ఇంధన ట్యాంక్‌ను కూడా కలిగి ఉంటుంది.
ఇక ఈ స్కూటర్ 124.6 సిసి ఎయిర్-కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజన్‌తో లాంచ్ అయినట్లు కంపెనీ వెల్లడించింది. అంతేకాకుండా ఇది CVT (నిరంతర వేరియబుల్ ట్రాన్స్‌మిషన్) టెక్నాలజీని కలిగి ఉంటుంది.
ఈ హీరో డెస్టినీ 125 స్కూటర్ బ్లూటూత్ కనెక్టివిటీ, టర్న్-బై-టర్న్ నావిగేషన్‌ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా కాల్ అలర్ట్ ఫీచర్స్‌ను కూడా అందిస్తోంది. ఇవే కాకుండా ఇతర ఫీచర్స్ కూడా లభిస్తున్నాయి.
ఇక ఈ స్కూటర్ i3S టెక్నాలజీని కూడా కలిగి ఉంటుంది. దీంతో పాటు డిజిటల్-అనలాగ్ కన్సోల్, మొబైల్ ఛార్జింగ్ పోర్ట్ వంటి ప్రత్యేకమైన ఫీచర్స్‌ను కూడా కలిగి ఉంటుంది. అలాగే ఇవే కాకుండా అనేక రకాల ఫీచర్స్ ఈ స్కూటర్‌లో లభిస్తున్నాయి.
ఈ స్కూటర్‌కి సంబంధించిన ధర వివరాల్లోకి వెళితే.. హీరో డెస్టినీ (Hero Destini 125 Scooter) సాధరణ వేరియంట్స్ LX రూ. 75,890, VX రూ. 79,990తో అందుబాటులోకి వచ్చాయి. ఇక హై ఎండ్ వేరియంట్స్ ZX రూ. 83,390, XTEC రూ. 87,590 ధరలో లభిస్తున్నాయి.