Heart Beats: నిమిషానికి గుండె ఎన్ని సార్లు కొట్టుకుంటుంది.. ఎలా కొలవాలి?

Heart Beats In Telugu: అన్ని అవయవాల్లో గుండె కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి గుండెను ప్రధాన అవయవంగా భావిస్తారు. ఒక వ్యక్తి జీవించాలంటే గుండె కీలక పాత్ర పోషిస్తుంది. గుండె ఒక్కొక్కరిలో ఒక్కొక్క విధంగా కొట్టుకుంటూ ఉంటుంది. చిన్న పిల్లలో ఎక్కువగా కొట్టుకుంటూ ఉంటే.. పెద్దవారిలో కాస్త తక్కువగా కొట్టుకుంటూ ఉంటుంది. అయితే మన హృదయం నిమిషానికి ఎన్ని సార్లు కొట్టుకుంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
 

1 /7

వయస్సును బట్టి గుండె కొట్టుకుంటుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. పెద్దవారిలో కంటే ఎక్కువగా అప్పుడే జన్మించిన పిల్లలో గుండే వేగంగా కొట్టుకుంటుంది.   

2 /7

అంతేకాకుండా చాలా మందిలో శరీర శ్రమ ఎక్కువగా చేయడం వల్ల కూడా గుండె వేగంగా కొట్టుంది. అలాగే కొంత మందిలో వ్యాయామాలు చేయడం వల్ల కూడా గుండె అధిక వేగంగా కొట్టుకుంటుందని సమాచారం..

3 /7

అలాగే భయం, కోపం, ఉత్సాహం వంటి భావోద్వేగాలకు గురయ్యే సమయంలో కూడా గుండె ఎక్కువగా కొట్టుకుంటుందని సమాచారం. అంతేకాకుండా మూడ్‌ స్పింగ్స్‌ వల్ల కూడా ప్రభావం పడుతుంది. 

4 /7

మరికొంతమందిలోనైతే.. ఆరోగ్య పరిస్థితుల కారణంగా కూడా గుండె కొట్టుకోవడంలో మార్పులు వస్తాయి. గుండె జబ్బులు, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్ వంటి ఆరోగ్య సమస్యలు గుండె కొట్టుకునే రేటును ప్రభావితం చేస్తాయి.

5 /7

అంతేకాకుండా కొంతమంది అధిక ఔషధాలను వినియోగించడం వల్ల కూడా గుండె కొట్టుకునే రేటు కూడా పెరుగుతుందని ఆరోగ్య ఇటీవలే పరిశోధనల్లో తెలింది.  

6 /7

పరిశోధనల్లో తెలిపిన వివరాల ప్రకారం.. విశ్రాంతి సమయంలో గుండె నిమిషానికి 60 నుంచి 100 సార్లు కొట్టుకుంటుంది. వ్యాయామం చేసేటప్పుడు నిమిషానికి 120 నుంచి 170 సార్లు కొట్టుకుంటుంది.

7 /7

గుండె కొట్టుకునే రేటును ఎలా కొలవాలో తెలుసా?..మణికట్టు లేదా మెడ వద్ద నాడిని తాకి, నిమిషానికి ఎన్ని సార్లు కొట్టుకుంటుందో లెక్కించవచ్చు. అంతేకాకుండా హార్ట్ రేట్ మానిటర్‌ను వినియోగించి కూడా లెక్కించవచ్చు.