Cholesterol Tips: కొలెస్ట్రాల్ అధికంగా ఉందా, మీ జీవనశైలిలో ఈ చిన్న చిన్న మార్పులు చేసి చూడండి

Cholesterol Tips: శరీరంలో కొలెస్ట్రాల్ అనేది అత్యంత ప్రమాదకరమైంది. ఒక్క కొలెస్ట్రాల్ వివిధ వ్యాధులకు కారణమౌతుంటుంది. అందుకే కొలెస్ట్రాల్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవల్సి ఉంటుంది. కొలెస్ట్రాల్ తగ్గించడం అనేది చాలా సులభమే. కానీ తూచా తప్పకుండా పాటించాల్సి ఉంటుంది.
 

Cholesterol Tips: చెడు ఆహారపు అలవాట్లు, జీవనశైలి కారణంగా కొలెస్ట్రాల్ పరిమాణం పెరిగిపోతుంటుంది. ఈ పరిస్థితుల్లో కొన్ని విధానాలు పాటించడం, కొన్ని మార్పులు చేర్పులు చేయడం ద్వారా కొలెస్ట్రాల్ నియంత్రించవచ్చు. 
 

1 /6

ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా వాల్‌నట్స్, ఫ్లక్స్ సీడ్స్‌ లో ఉంటాయి. అందుకే వీటిని డైట్‌లో చేర్చాలి.

2 /6

డైట్‌లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ తప్పకుండా ఉండేలా చూసుకోవాలి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కొలెస్ట్రాల్ తగ్గించడంలో అద్బుతంగా ఉపయోగపడతాయి.

3 /6

ప్రతి వ్యక్తి రోజువారీ దినచర్యలో వ్యాయామం తప్పకుండా ఉండేట్టు చూసుకోవాలి. కనీసం 15-20 నిమిషాలు వ్యామాయం తప్పనిసరి. రక్త సరఫరా మెరుగుపర్చుకోవాలి,.

4 /6

మనిషి తన శరీర బరువుపై కూడా ప్రత్యేక దృష్టి సారించాల్సి ఉంటుంది. బరువు తగ్గినా కొలెస్ట్రాల్ తగ్గుతుంది.

5 /6

ఫైబర్ పుష్కలంగా ఉండాలంటే డైట్‌లో దాలియా, బీన్స్, స్ప్రౌట్, ఆపిల్ వంటివి అధికంగా ఉండేట్టు చూసుకోవాలి.

6 /6

ముందుగా తీసుకునే ఆహారంలో ఫైబర్ అధికంగా ఉండేట్టు చూసుకోవాలి. ఇవి శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో దోహదపడతాయి