Food Combinations: కాకరకాయతో ఈ పదార్ధాలు కలిపి తింటే ఇక అంతే, అనారోగ్యం తప్పదు

Food Combinations: కాకరకాయ..అత్యంత చేదుగా ఉండే కూరగాయ. కానీ ఆరోగ్యపరంగా అంత అద్భుతమైన ప్రయోజనాలు మరి దేంట్లోనూ కలగవు. నిర్ణీత పద్ధతితో మోతాదుగా తింటే మధుమేహం వంటి ప్రమాదకర వ్యాధుల్నించి కూడా రక్షించుకోవచ్చు. 

Food Combinations: అదే సమయంలో కాకరకాయను కొన్ని పదార్ధాలతో కలిపి తినకూడదని న్యూట్రిషనిస్టులు సూచిస్తున్నారు. కొన్ని రకాల పదార్ధాలతో కలిపి తినడం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుంది. ఆ పదార్ధాలేంటో తెలుసుకుందాం..
 

1 /5

ముల్లంగి ముల్లంగి, కాకరకాయ రెండింటి స్వభావం వేర్వేరుగా ఉంటుంది. అందుకే ఈ రెండూ కలిపి తింటే కడుపులో సమస్య ఉత్పన్నమౌతుంది. ఫలితంగా మలబద్ధకం, విరేచనాలు, కడుపు నొప్పి సమస్య రావచ్చు.

2 /5

పాలు కేరళలో ఉండే కొన్ని పోషకాలు పాలలో ఉండే ప్రోటీన్లతో కలిస్తే ప్రతి క్రియ ఏర్పడవచ్చు. ఫలితంగా కడుపులో సమస్య తలెత్తుతుంది. దీనివల్ల అజీర్తి, మలబద్ధకం, విరేఛనాలు, కడుపునొప్పి వంటి సమస్యలు ఉత్పన్నమౌతాయి.

3 /5

మామిడి కాకరకాయ, మామిడి రెండూ పరస్పర వ్యతిరేక రుచులు కలిగినవి. ఈ రెండింటినీ కలిపితే ఎసిడిటీ, వాంతులు వంటి సమస్యలు రావచ్చు.

4 /5

బెండకాయ కాకరకాయ, బెండకాయ రెండూ జీర్ణమయ్యేందుకు సమయం పడుతుంది. ఈ రెండు కలిపి ఒకేసారి తింటే కడుపులో సమస్య ఏర్పడుతుంది. మలబద్ధకం, విరేచనాలు, కడుపులో నొప్పికి కారణమౌతుంది

5 /5

పెరుగు కాకరకాయ, పెరుగు రెండూ జీర్ణమయ్యేందుకు సమయం పడుతుంది. అందుకే ఈ రెండూ కలిపి తింటే సమస్య మరింత పెరుగుతుంది. పలితంగా కడుపు నొప్పి, మలబద్ధకం సమస్యలు రావచ్చు.