Papaya on Empty Stomach: షుగర్ ఉన్నవాళ్లు పరగడుపున బొప్పాయి తింటే ఏమవుతుందో తెలుసా?

1 /5

బొప్పాయిలో పెప్సిన్ అధికంగ ఉంటుంది. ఇది మలబద్ధకం సమస్యను తగ్గిస్తుంది .రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించడానికి ఉపయోగపడుతుంది.ఇందులో విటమిన్ ఏ ఎక్కువగా ఉండటం వల్ల చర్మ సమస్యలు రావు మినరల్స్ ఫాస్ఫరస్ మినరల్స్ అధికంగా ఉంటాయి.ఈ ఆంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండటం వల్ల క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది

2 /5

బొప్పాయి రోజుకు సుమారు మూడు పీసుల వరకు తీసుకోవచ్చు ఎవరైతే మలబద్ధకం సమస్యతో బాధపడేవారు రాత్రి సమయంలో తీసుకుంటే మంచిది దీంతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.  కానీ పచ్చి బొప్పాయి తీసుకునే కొంతమందికి వాంతులు వంటివి సైడ్ ఎఫెక్ట్స్ కనిపిస్తాయి.ప్రెగ్నెన్సీ ఉన్నవాళ్లు కిడ్నీలో రాళ్ల సమస్య ఉన్న వాళ్ళు తినకుండా ఉండటం మంచిది.  

3 /5

బొప్పాయి ప్రస్తుతం మార్కెట్లో పుష్కలంగా అందుబాటులో ఉంటుంది.  కానీ దీన్ని తినడానికి చాలామంది ఆసక్తి తక్కువగా ఉంటుంది. అజీర్తితో బాధపడే వారికి బొప్పాయి ఎంతో మేలు చేస్తుంది. ఇది కిడ్నీలను ఎంతో మేలు చేసి ఆరోగ్యంగా ఉంచుతుంది. బొప్పాయిలో పెద్ద మొత్తంలో ఫైబర్ ఉండటం వల్ల బరువు తగ్గే వారికి ఇది బెస్ట్ ఆప్షన్. బొప్పాయి పండులో ఉండే విటమిన్స్ ఏ పండులో లేవు. ఇందులో విటమిన్ ఎ బి సి లు అధికంగా ఉంటాయి.

4 /5

ఇందులో పెప్సిన్ అనే పదార్థం ఉండటం వల్ల జీర్ణక్రియకు మంచిది. అనారోగ్య సమస్యలతో బాధపడేవారు బొప్పాయిని తినాలి పొట్టను క్లీన్ చేసే శక్తి ఉంటుంది. బొప్పాయిలో ఫ్లేవర్ నైట్ మినరల్స్ పొటాషియం అధికంగా ఉంటాయి. అధిక బరువును తగ్గించడంలో సమర్థవంతంగా పనిచేస్తుంది. బొప్పాయి గుండె జబ్బుల్ని అరికట్టడంలో సమర్థవంతంగా పనిచేస్తుంది. 

5 /5

మామిడిపండు తర్వాత బొప్పాయి లోనే విటమిన్ ఏ అధిక పరిమాణంలో కనిపిస్తుంది. ఈ పండులోని బీటా కెరటీన్ కంటి సంబంధిత సమస్యలు రాకుండా కాపాడుతుంది. చిగుళ్ల ఆరోగ్యానికి సహకరిస్తుంది రోగనిరోధ శక్తికి తోడ్పడుతుంది నోటిపూత తెల్ల మచ్చలు రాకుండా కాపాడుతుంది మధుమేహాని కూడా అదుపులో అరికడుతుందని కొన్ని అధ్యయనాలు తెలిపాయి. దీన్ని పరడగడుపున తింటే మంచి ఫలితాలు పొందొచ్చు.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )