HDFC home loan interest rates: ఇల్లు కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్.. హోమ్ లోన్స్ వడ్డీ రేట్లు తగ్గించిన HDFC

HDFC home loan interest rates: ఎస్బీఐ, కొటక్ మహీంద్రా బ్యాంకుల బాటలోనే హౌజింగ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కూడా తమ కస్టమర్స్‌కి ఇచ్చే Home loans పై వడ్డీ రేట్లను తగ్గించింది. 5 బేసిస్ పాయింట్స్ తగ్గించిన అనంతరం Housing Development Finance Corporation హోమ్ లోన్స్ వడ్డీ రేటు 6.75% కి చేరింది.

  • Mar 03, 2021, 23:35 PM IST

Home loans interest rates పై బ్యాంకులు పోటాపోటీగా అందిస్తున్న ఈ ఆఫర్స్ లిమిటెడ్ పీరియడ్ ఆఫర్స్ మాత్రమేనని కస్టమర్స్ గమనించాల్సి ఉంటుంది.  31st March వరకు మాత్రమే ఈ ఆఫర్స్ అందుబాటులో ఉంటాయని బ్యాంకులు తెలిపాయి.

1 /7

HDFC home loan interest rates: ఎస్బీఐ, కొటక్ మహీంద్రా బ్యాంకుల బాటలోనే హౌజింగ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కూడా తమ కస్టమర్స్‌కి ఇచ్చే Home loans పై వడ్డీ రేట్లను తగ్గించింది. 5 బేసిస్ పాయింట్స్ తగ్గించిన అనంతరం Housing Development Finance Corporation హోమ్ లోన్స్ వడ్డీ రేటు 6.75% కి చేరింది.

2 /7

మారిన వడ్డీ రేట్లు మార్చి 4 నుంచే అమలులోకి రానున్నాయని హెచ్‌డీఎఫ్‌సి ప్రకటించింది. ప్రస్తుతం ఉన్న HDFC retail home loan customers కి సైతం ఈ తగ్గిన వడ్డీ రేట్ల Benefits వర్తిస్తాయని HDFC తమ తాజా ప్రకటనలో పేర్కొంది.

3 /7

SBI, Kotak Mahindra Bank సైతం ఇటీవలే హోమ్ లోన్స్ ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించిన సంగతి తెలిసిందే. SBI Home loans interest rates విషయానికొస్తే.. రూ. 75 లక్షల వరకు హోమ్ లోన్ తీసుకునే వారికి 6.70 శాతం, రూ.75 లక్షల నుంచి రూ. 5 కోట్ల వరకు Home loans తీసుకునే వారికి 6.75 శాతం వడ్డీ రేటు చార్జ్ చేస్తోంది.

4 /7

processing fees పై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 100 శాతం డిస్కౌంట్ అందిస్తోంది. కస్టమర్ CIBIL score, తీసుకునే లోన్ మొత్తాన్నిబట్టి వడ్డీ రేటు మారుతుంటుంది.

5 /7

అలాగే గతంలో తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించడంలో ఎలాంటి జాప్యం చేయని వారికి (Good repayment history) కూడా వీలైనంత తక్కువ వడ్డీ రేటు చార్జ్ చేయాలనేది Home loan interest rates పాలసీలో ఒక భాగంగా పెట్టుకున్నట్టు SBI తెలిపింది.

6 /7

Kotak Mahindra Home loans interest rates విషయానికొస్తే.. ఇటీవలే 10 బేసిస్ పాయింట్స్ తగ్గించిన కొటక్ మహీంద్రా బ్యాంక్.. ప్రస్తుతం 6.65 శాతం వడ్డీ రేటుతో గృహ రుణాలను అందిస్తున్నట్టు పేర్కొంది. హోమ్ లోన్స్ మార్కెట్‌లో తమదే అత్యంత Lowest home loans interest rates గా కొటక్ మహీంద్రా స్పష్టంచేసింది.

7 /7

Home loans interest rates పై బ్యాంకులు పోటాపోటీగా అందిస్తున్న ఈ ఆఫర్స్ లిమిటెడ్ పీరియడ్ ఆఫర్స్ మాత్రమేనని కస్టమర్స్ గమనించాల్సి ఉంటుంది.  31st March వరకు మాత్రమే ఈ ఆఫర్స్ అందుబాటులో ఉంటాయని బ్యాంకులు తెలిపాయి.  Also read : EPFO Interest Rates: 6 కోట్ల మంది EPF ఖాతాదారులకు షాక్, వడ్డీ రేట్లుపై ఎంతమేర కోత విధిస్తారో Also read : Lamborghini Urus car: రూ. 5 కోట్లతో ఎవ్వరికీ లేని Luxury car book చేసిన Jr Ntr ! Also read : 7th Pay Commission Latest News: ఇన్‌కమ్ ట్యాక్స్ అదనపు ప్రయోజనాలు పొందాలనుకుంటే Govt Employeesకు శుభవార్త