HBD Raashi Khanna | ఊహలు గుసగుసలాడే చిత్రంతో తెలుగు ప్రేక్షకుల మనసులో చోటు సంపాదించుకున్న రాశీ ఖన్నా.. నిజానికి యాడ్ ఫిలింస్ చేద్దాం అనుకుంది. కాపీ రైటర్ గా రాణిద్దాం అనుకుంది. కానీ తాను ఒకటి తలిస్తే విధి ఒకటి తలుస్తుంది అంటారు కదా..ఇప్పుడు సూపర్ హీరోయిన్ అయిపోయింది.
Facts About Raashi Khanna | నవంబర్ 30న రాశీ ఖన్నా పుట్టిన రోజు ఈ సందర్భంగా గురించి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు చదివేయండి
Also Read | Nayanthara: తమిళ రాజకీయాల్లో నయతార ప్రేమ కథల ప్రభావం
రాశి ఖన్నా ఢిల్లీకి చెందిన అమ్మాయి. నవంబర్ 30న 1990లో జన్మించింది రాశీ ఖన్నా ..ఢిల్లీలోని సెంట్ మార్క్స్ సీనియర్ సెకండరీ పబ్లిక్ స్కూల్లో ప్రాధమిక విద్యాభ్యాసం పూర్తి చేసింది.
బ్యూటిఫుల్ హీరోయిన్ రాశీ ఖన్నా బీఏ ఇంగ్లిష్ పూర్తి చేసింది. తరువాత కాపీ రైటర్ అవ్వాలి అనుకుంది. యాడ్ ఫిలింస్ చేద్దాం అనుకుంది.
జాన్ అబ్రాహం హీరోగా వచ్చిన మద్రాస్ కేఫ్ చిత్రంతో తెరంగేట్రం చేసింది రాశీ ఖన్నా. తరువాత తెలుగు చిత్ర ఊహలు గుసగుసలాడేలో నటించింది.
రాశీఖన్నాకు షారుఖ్ ఖాన్, మహేష్ బాబు, రణ్ బీర్ కపూర్, మాధురీ దీక్షిత్, ప్రియాంకా చోప్రా అంటే ఇష్టమట.
దక్షిణాదిలో స్టార్ హీరోయిన్స్ లో ఒకరైనా రాశీ కన్నా ప్రతీ చిత్రానికి 30 లక్షల రెమ్యునరేషన్ తీసుకుంటుందట.