Seetimaarr first look photos: సీటీమార్ ఫస్ట్‌లుక్ ఫోటో స్టిల్స్ విడుదల

మైదానంలో ఆడితో ఆట..బయట ఆడితే వేట అనే డైలాగ్స్ అభిమానుల్ని విపరీతంగా ఆకట్టుకోవడమే కాకుండా అప్పుడే మీమ్స్‌గా ట్రోల్ అవుతున్నాయి. దీనికి తోడు ఫస్ట్‌లుక్ ఫోటో స్టిల్స్  కూడా వైరల్ అవుతున్నాయి. కబడ్డీ టీమ్ కోచ్‌లుగా టీమ్‌తో ఉన్న గోపీచంద్, తమన్నా ఫోటోలు అభిమానుల్ని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.

Seetimaarr first look photos: మైదానంలో ఆడితో ఆట..బయట ఆడితే వేట అనే డైలాగ్స్ అభిమానుల్ని విపరీతంగా ఆకట్టుకోవడమే కాకుండా అప్పుడే మీమ్స్‌గా ట్రోల్ అవుతున్నాయి. దీనికి తోడు ఫస్ట్‌లుక్ ఫోటో స్టిల్స్  కూడా వైరల్ అవుతున్నాయి. కబడ్డీ టీమ్ కోచ్‌లుగా టీమ్‌తో ఉన్న గోపీచంద్, తమన్నా ఫోటోలు అభిమానుల్ని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.

1 /5

2 /5

గోపీచంద్ ఆంధ్రా టీమ్‌కు కోచ్‌గా వ్యవహరిస్తుండగా తమన్నా తెలంగాణ మహిళా టీమ్ కోచ్‌గా నటిస్తోంది. సినిమాకు మణిశర్న సంగీతం అందించగా..సూర్యవంశీ, భూమికా చావ్లా, రెహ్మాన్, రావు రమేశ్, తరుణ్ అరోరా, పోసాని కృష్ణమురళి, రోహిత్ పాథక్, అంకూర్ సింగ్  తదితరులు కీలకపాత్రల్లో కన్పించనున్నారు.

3 /5

కబడ్డీ ఆట నేపధ్యంలో సినిమా కధ ఉంటుంది. సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కిన సీటీమార్ సినిమా ఏప్రిల్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

4 /5

తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు గోపీచంద్. విలన్‌గా ఎంట్రీ ఇచ్చినా హీరోగా నిలదొక్కుకున్నాడు. గోపీచంద్‌తో సినిమా అంటే మినిమమ్ గ్యారంటీ ఖాయమనేది నిర్మాతల అభిప్రాయం. యాక్షన్ హీరోగా పేరు సంపాదించుకున్న గోపీచంద్ తాజా చిత్రం సీటీమార్. తమన్నా, గోపీచంద్‌లు హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన సీటీమార్ సినిమా టీజర్ ఫిబ్రవరి 22న విడుదలై సంచలనం కల్గిస్తోంది. 

5 /5

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా 2020 బ్రేక్ ఫలితం. 2021లో వరుసగా సినిమాలు, టీజర్ల విడుదల హల్‌చల్ చేస్తున్నాయి. టాలీవుడ్ యాక్షన్ హీరో గోపీచంద్‌తో తెరకెక్కిన సీటీమార్ టీజర్ విడుదలైంది. గోపీచంద్ డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి.