Yadagirigutta: యాదగిరిగుట్టకు వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్‌.. పదేళ్ల తర్వాత కొండపైనే స్నానం చేసే అవకాశం..!

Sankalpa Snanam in Yadagirigutta: యాదగిరి గుట్టకు వెళ్లే భక్తులు సాధారణంగా పదేళ్ల కిందట అయితే, కొండపైన కల్యాణకట్ట వద్ద ఉండే విష్ణు పుష్కరిణిలో స్నానాలు ఆచరించి యాదగిరీషుని దర్శనం చేసుకునేవారు. అయితే, అభివృద్ధి నిర్మాణ పనుల్లో భాగంగా కొండ కింద గుండం ఏర్పాటు చేశారు..
 

1 /5

గుట్టపైన బాలాలయం ఏర్పాటు చేసి స్వామివారి దర్శనాలు కల్పించారు. ఆ తర్వాత గుట్ట పనులు పూర్తయ్యాయి. లక్ష్మి నరసింహ స్వామి దర్శనం కూడా కొత్తగా నిర్మించిన ఆలయంలో కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో స్నానం మాత్రం నిన్నటి వరకు కింద ఏర్పాటు చేసిన గుండంలో మాత్రమే చేసేవారు. కానీ యాదాద్రీ ఆలయ అధికారులు భక్తులకు గుడ్‌ న్యూస్‌ చెప్పారు.  

2 /5

ఇకపై కొండపై ఏర్పాటు చేసిన విష్ణు పుష్కరిణిలోనే స్నానాలు చేయవచ్చని చెప్పారు. ఈ నెల 11వ తేదీ ఆదివారం స్వాతి నక్షత్రం సమయంలో ఉదయం 9:30 గంటలకు కొండపైన విష్ణుపుష్కరిణి ప్రారంభిస్తున్నట్లు ఆలయ ఈవో భాస్కరరావు తెలిపారు.  

3 /5

దీంతో గతంలో మాదిరి యాదగిరి గుట్టకు వెళ్లే భక్తులు పుష్కరిణిలో స్నానం చేసి యాదగిరీషుని దర్శనం చేసుకోవచ్చు. అంటే దాదాపు పదేళ్ల తర్వాత తిరిగి పుష్కరిణిలో స్నానం చేసే వెసులుబాటు కల్పించింది. కొండ కింద ఉన్న పుష్కరిణిలో స్నానాలు చేయడానికి భక్తులు ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నారు.  

4 /5

ఈ సందర్భంగా భక్తుల సౌకర్యార్థం ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. కొండ కింద ఉండే పుష్కరిణి కూడా కాస్త దూరంలో ఏర్పాటు చేయడం, కొత్తగా వచ్చిన భక్తులకు అయితే, పుష్కరిణి ఎక్కడ ఉందో కూడా తెలియని దుస్థితి ఏర్పడింది. అయితే, ఇలా కొండపైన స్నానం చేయడానికి ఉచితంగా కాకుండా రూ.500 టిక్కెట్లు పెట్టారు.  

5 /5

అయితే, పుష్కరిణిలో స్నానం ఆచరించిన భక్తులకు స్వామివారి ప్రత్యేక దర్శనం కూడ కల్పించనున్నారు. ఓ లడ్డూ కూడా అందిస్తారు. అయితే, టిక్కెట్లు తీసుకోలేని భక్తులకు పుష్కరిని నీరు తలపై జల్లుకునే అనుమతి ఉంది.