AP Pention Free Bus: ఆంధ్ర ప్రదేశ్ లో కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టడంతో ఉచిత బస్సు సౌకర్యంపై విధి విధానాలను రూపొందించే పనిలో పడ్డారు సీఎం చంద్రబాబు నాయుడు. అందులో తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న పురుషులకు కూడా ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలనే యోజనలో ప్రభుత్వం ఉంది.
AP Pention Free Bus: గత సార్వత్రిక ఎన్నికల ముందు ఆంధ్ర ప్రదేశ్ లో అధికారంలోకి వస్తే.. తెలంగాణలో మాదిరే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని చంద్రబాబు నాయుడు హామి ఇచ్చారు.
ఆంధ్ర ప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలో వస్తే మహిళకు ఫ్రీ బస్సు పథకం అమల్లోకి తీసుకొస్తామంటూ హామి ఇచ్చారు. ఇప్పటికే కర్ణాటక, తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం వలన ఆర్టీసీ నష్టాల ఊబిలో కూరుకుపోతుంది.
దీంతో ఇప్పటికే కర్ణాటకలో ఛార్జీలను పెంచింది అక్కడ సర్కారు. తెలంగాణలో కూడా త్వరలో ఛార్జీలను పెంచే యోచనలో రేవంత్ సర్కార్ ఆలోచిస్తోంది. ఆ సంగతి పక్కన పెడితే.
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మహిళలతో పాటు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న పురుషులకు కూడా ఫ్రీ బస్సు పథకం విషయంలో కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది.రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేసేందుకు చంద్రబాబు సర్కార్ సిద్దమైంది.
తాజాగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతూ పింఛన్లు అందుకునే పురుషులకు కూడా ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది.
అంతేకాదు అనారోగ్య సమస్యలతో బాధపడుతూ వైద్య సేవలు పొందేందుకు వీలుగా ఉచితంగా బస్సుపాస్‌లు వంటివి పురుషులు ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది. గుండెజబ్బులు, కిడ్నీ, పక్షవాతం, లివర్, తలసేమియా, లెప్రసీ, సీవియర్ హీమోఫిలియా వంటి సమస్యలున్న వారికి కూడా ఈ ఫ్రీ బస్సు సౌకర్యం అందించాలని భావిస్తున్నారు. త్వరలో దీనిపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.