DA Hike: ఉద్యోగులకు గుడ్‌న్యూస్, డీఏ పెంపుపై క్లారిటీ, జీతం, డీఏ ఎంత పెరుగుతాయంటే

7వ వేతన సంఘానికి సంబంధించి కీలకమైన అప్‌డేట్ వెలువడనుంది. డీఏ మరోసారి పెరగనుంది. మే వరకూ ఏఐసీపీఐ ఇండెక్స్ అప్‌డేట్ అవడంతో జూలైలో పెరగాల్సిన డీఏ ఎంతో దాదాపుగా క్లారిటీ వచ్చేసింది. ఈసారి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ ఏకంగా 53 శాతానికి చేరుకోనుంది. డీఏ పెంపుకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

7th Pay Commission DA Hike: 7వ వేతన సంఘానికి సంబంధించి కీలకమైన అప్‌డేట్ వెలువడనుంది. డీఏ మరోసారి పెరగనుంది. మే వరకూ ఏఐసీపీఐ ఇండెక్స్ అప్‌డేట్ అవడంతో జూలైలో పెరగాల్సిన డీఏ ఎంతో దాదాపుగా క్లారిటీ వచ్చేసింది. ఈసారి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ ఏకంగా 53 శాతానికి చేరుకోనుంది. డీఏ పెంపుకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

1 /5

7th Pay Commission DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త డీఏ పెంపు 3 శాతం సెప్టెంబర్ నెలలో ఎరియర్లతో సహా ప్రకటించవచ్చు. వేతన సంఘం నిబంధనలు అమలు చేస్తే డీఏ 50 దాటినప్పుడు మొత్తం డీఏను కనీస వేతనంలో కలిపి తిరిగి జీరో నుంచి లెక్కిస్తారు. 

2 /5

7th Pay Commission DA Hike: అంటే జూన్ నెల ఏఐసీపీఐ సూచీ విడుదలయ్యాక లెక్కించినా డీఏ పెంపు 3 శాతానికి అటూ ఇటూ ఉంటుంది. దాంతో మొత్తం డీఏ 53 శాతానికి చేరుకుంటుంది. ఓవరాల్‌గా 53.28 శాతానికి చేరుకోవచ్చని అంచనా. దాంతో రౌండ్ చేసి 53 శాతంగా పరిగణిస్తారు. 

3 /5

7th Pay Commission DA Hike: ఇప్పటి వరకూ మే వరకూ ఏఐసీపీఐ ఇండెక్స్ వచ్చింది. జూలై నెలాఖరుకు జూన్ నెల సీపీఐ విడుదల కానుంది. జూన్ కూడా కలుపుకుంటే ఈసారి డీఏ 3 శాతం పెరగవచ్చు. అంటే మొత్తం డీఏ ఇక 53 శాతానికి చేరుకుంటుంది. మే సూచీ 139.5 పాయింట్లుగా ఉంది. అంటే డీఏ 52.91 శాతం కావచ్చు. రౌండ్ చేస్తే 53 శాతమౌతుంది. జూన్‌లో మరో 0.5 పాయింట్లు పెరిగినా డీఏలో పెద్ద తేడా ఉండకపోవచ్చు.

4 /5

7th Pay Commission DA Hike: ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ 50 శాతంగా ఉంది. జనవరి 2024కు సంబంధించి మార్చ్ నెలలో పెంపు ప్రకారం డీఏ 50 శాతానికి చేరింది. డీఏ పెంపు అనేది ఏఐసీపీఐ ఇండెక్స్ ఆధారంగా ఉంటుంది. ఏఐసీపీఐ ఇండెక్స్ అనేది ద్రవ్యోల్బణం రేటును సూచిస్తుంది. 

5 /5

7th Pay Commission DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరోసారి శుభవార్త. ఏడాదిలో రెండవసారి జూలైలో పెరగాల్సిన డీఏపై స్పష్టత వస్తోంది. మే నెల ఏఐసీపీఐ ఇండెక్స్ విడుదలైంది. ఇంకా జూన్ నెల రావల్సి ఉంది. అయితే మే వరకూ లెక్కేసినా డీఏ 53 శాతానికి చేరుకోవచ్చని తెలుస్తోంది.