Gold Rate Today: నేడు భారీగా తగ్గిన పసిడి ధర..శనివారం ధరలు ఎలా ఉన్నాయంటే..తులంపై 7వేలు తక్కువ

Gold Rate Today:  బంగారం ధరలు భారీగా తగ్గుముఖం పట్టింది. శుక్రవారంతో పోల్చి చూస్తే శనివారం దాదాపు 500 రూపాయలు తగ్గింది. ప్రస్తుతం బంగారం ధర 10 గ్రాములకు 78వేల మధ్య ట్రేడింగ్ లో ఉంది. బంగారం ధర ప్రస్తుతం గత నెలలో నమోదు చేసిన ఆల్ టైం రికార్డ్ స్థాయి కంటే 7వేల రూపాయలు తక్కువగా ఉంది. 

1 /7

Gold Rate Today:  బంగారం ధరలు భారీగా తగ్గుముఖం పడుతున్నాయి. శుక్రవారంతో పోల్చితే బంగారం ధర నేడు శనివారం 500రూపాయలు తగ్గింది. అయినప్పటికీ బంగారం ధర ప్రస్తుతం 10 గ్రాములకు 78 వేల మధ్య ట్రేడింగ్ అవుతోంది.

2 /7

నేడు బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 78, 340 ఉంది. అదే సమయంలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 71950 దగ్గర ట్రేడ్ అవుతోంది.   

3 /7

బంగారం ధరలు గడిచిన 3 నెలలుగా గమనించినట్లయితే భారీగా పెరిగినట్లు చెప్పవచ్చు. ముఖ్యంగా జులై నెల నుంచి నవంబర్ నెల వరకు గమనించినట్లయితే పసిడి ధర ఏకంగా 67వేల రూపాలయ నుంచి 84 వేల వరకు పెరిగింది. అంటే దాదాపు 17వేల రూపాయలు పెరిగింది.

4 /7

బంగారం ధరలు భారీగా తగ్గుతున్న తరుణంలో బంగారు ఆభరణాలు కొనుగోలు చేయాలని చాలా మంది అనుకుంటారు. మరి ఈ స్థాయి నుంచి బంగారం ధర ఇంకా తగ్గుతుందా అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. 

5 /7

ధర తగ్గినప్పుడు కొత్తగా బంగారు నగలు కొనుగోలు చేసేందుకు సమయం అనుకూలంగా ఉంటుందని చెబుతున్నారు బులియన్ మార్కెట్ నిపుణులు   

6 /7

బంగారం ధరలు తగ్గడానికి ముఖ్యంగా అంతర్జాతీయంగా నెలకొన్న పరిణామాలను  ఓ కారణంగా చెప్పవచ్చు. ప్రధానంగా డాలర్ రేటు భారీగా పెరుగడం కూడా పసిడి ధరలు తగ్గడానికి కారణం. 

7 /7

పెట్టుబడి దారులు తమ ఇన్వెస్ట్ మెంట్ బంగారం వైపు నుంచి డాలర్ బాండ్ల వైపు తరలిస్తున్నారు. ఇదొక కారణమని చెప్పవచ్చు.