Gold Rate Today: మగువలకు గుడ్ న్యూస్.. దిగివస్తున్న బంగారం ధర.. నేటి గోల్డ్ రేట్స్ ఇవే

Today Gold Price: బంగారం కొనాలని ప్లాన్ చేస్తున్నవారికి గుడ్ న్యూస్. గత రెండు రోజులుగా దేశవ్యాప్తంగా బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి. నేడు సెప్టెంబర్ 5 గురువారం బంగారం ధర స్వల్పంగా తగ్గింది. హైదరాబాద్ లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. 
 

1 /5

Gold Rates In Hyderabad: సెప్టెంబర్ 5 గురువారం బంగారం ధరలు స్వల్పంగా తగ్గుదల నమోదు చేశాయి. బంగారం ధరలు తాజాగా గమనించినట్లయితే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 72,600  నమోదు అవగా,  22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 66,100  వద్ద నమోదు అవుతోంది.  బంగారం ధరలో  గడచిన మూడు రోజులుగా తగు ముఖం పడుతున్నాయి.  ప్రస్తుతం బంగారం ధర 75 వేల రూపాయల రూపాయలకి దిగువనే ట్రేడ్ అవుతున్నది.  

2 /5

ఇదిలా ఉంటే గతంలో బంగారం ధర 75000 వద్ద ఆల్ టైం గరిష్ట తాకింది అక్కడి నుంచి నెమ్మదిగా బంగారం ధర తగ్గుతూ వచ్చింది.  బంగారం ధరలు తగ్గడానికి ప్రధానంగా దేశవ్యాప్తంగా ఉన్న శ్రావణమాసం పెళ్లిళ్ల సీజన్ డిమాండ్ తగ్గిపోయింది.  దీంతో బంగారం ధరలు స్వల్పంగా తగ్గుముఖం పడుతున్నాయి.  ప్రస్తుతం బంగారం ధరలు ఈ నెలలో భారీగా పెరిగే అవకాశం ఉందని కూడా  అంచనాలు వేల వాడుతున్నాయి ఎందుకు ప్రధానంగా. 

3 /5

ఈనెల జరగబోయే అమెరికా ఫెడరల్ రిజర్వ్ పావు శాతం మేర కీలక వడ్డీ రేట్లు తగ్గించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఫెడరల్ పావు శాతం వడ్డీలను తగ్గించినట్లయితే బంగారం ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంటుంది.  బంగారం ధరలకు ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్లు అవినాభావ సంబంధం ఉంది. వడ్డీ రేట్లు తగ్గించినప్పుడల్లా బంగారం డిమాండ్ పెరుగుతూ ఉంటుంది.  

4 /5

ఎందుకంటే అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల  తగ్గింపు వల్ల, ఎవరైతే అమెరికా జారీ చేసిన ట్రెజరీ బాండ్ లో పెట్టుబడి పెట్టారు వారంతా కూడా  పెట్టుబడులను బంగారం వైపు తరలించే ప్రమాదం ఉంటుంది.  ఎందుకంటే అమెరికా వడ్డీ రేట్లు తగ్గించినప్పుడల్లా అమెరికా జారీ చేసిన ట్రెజరీ బాండ్ల పై వచ్చే రాబడి కూడా తగ్గుతుంది.  అలాంటి సమయంలో ఇన్వెస్టర్లు తమ డబ్బును సురక్షితమైన స్థానంగా భావించే  బంగారం వైపు తరలిస్తూ ఉంటారు.    

5 /5

మరోవైపు బంగారం ధరలు ఇప్పటికే ఆల్ టైం గరిష్ట స్థాయికి సమీపంలో ట్రేడ్ అవుతున్నాయి. ఒకవేళ అంతర్జాతీయంగా పరిస్థితులు బంగారం పెరుగుదలకు దోహదం చేసినట్లయితే.  నెక్స్ట్ టార్గెట్ 80000  రూపాయల వద్ద  కనిపిస్తోంది. బంగారం ధరలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో మీరు బంగారం ద్వారా పెట్టుబడులను పెట్టాలని ఆలోచిస్తున్నట్లయితే ఫిజికల్ గోల్డ్ కు బదులుగా..కేంద్ర ప్రభుత్వం జారీ చేస్తున్న గోల్డ్ బాండ్ పథకంలో పెట్టుబడి పెట్టినట్లయితే మీకు మంచి లాభం తో పాటు వడ్డీ ఆదాయం కూడా లభించే అవకాశం ఉంది.