BSNL Bumper Offer: బంపర్‌ ఆఫర్ ప్రకటించిన BSNL.. అత్యంత చవకైన రూ.214 ప్లాన్‌ రోజుకు 3 జీబీ డేటా వ్యాలిడిటీ ఎంతో తెలుసా?

BSNL Daily 3 GB Data: బీఎస్‌ఎన్‌ఎల్ సరికొత్త ఆఫర్లను ఎప్పటికప్పుడు ప్రకటిస్తూ మొబైల్‌ వినియోగదారులను ఆకట్టుకుంటుంది. ప్రతిరోజూ 3 జీబీ డేటాతో మరో కొత్త ఆఫర్‌ను మీ ముందుకు తీసుకువచ్చింది. ఇందులో అపరిమిత కాలింగ్‌ డేటాతోపాటు ఉచిత ఎస్‌ఎంఎస్‌లు కూడా  పొందుతారు.
 

1 /5

BSNL Daily 3 GB Data: ఇటీవలె పెరిగిన టెలికాం కంపెనీల రీఛార్జీ ప్లాన్స్‌ జియో, ఎయిర్‌టెల్, వీఐ యూజరల్ఉ కూడా బీఎస్‌ఎన్‌ఎల్‌కు  చాలా మంది మారారు. ఎందుకంటే ప్రభుత్వరంగ సంస్థ అయిన బీఎస్‌ఎన్‌ఎల్ అతి తక్కువ ధరకే అందుబాటులో ఉన్నాయి. ఈ సందర్భంగా మరింత స్పీడ్‌ పెంచిన బీఎస్‌ఎన్‌ఎల్ దేశవ్యాప్తంగా 4 జీ సర్వీసులను ప్రారంభించడానికి ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ప్రారంభించింది కూడా.  

2 /5

ప్రైవేటు టెలికాం కంపెనీలు తమ మొబైల్‌ రీఛార్జీ ట్యారిఫ్లను దాదాపు 15 శాతం పెంచేశాయి. కానీ, బీఎస్‌ఎన్‌ఎల్ మాత్రం తమ కస్టమర్లకు ఆకట్టుకునేందుకు సరసమైన ధరల్లో రీఛార్జీ ప్లాన్లను పరిచయం చేస్తోంది.   

3 /5

తాజాగా బీఎస్‌ఎన్‌ఎల్ తన ఎక్స్‌ హ్యాండిల్లో బీఎస్‌ఎన్‌ఎల్ మొబైల్‌ ట్యారిఫ్ల వివరాలను పోస్ట్‌ చేసింది. ఇందులో ప్రతి రోజు 3 జీబీ డేటా ఒక నెలపాటు కేవలం రూ.214 కు మాత్రమే లభిస్తుంది. ఈ ప్లాన్‌ రూ.599 ధరకు 84 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది.  

4 /5

రూ.599 ప్లాన్.. రూ.599 ప్లాన్‌తో 84 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. ఇందులో అపరిమిత వాయిస్‌ కాలింగ్‌, ప్రతిరోజ 100 ఎస్‌ఎంఎస్‌లు పొందుతారు. ఈ ప్లాన్ డేటా ఎక్కువగా వినియోగించే యూజర్లకు బెస్ట్‌ ఆప్షన్‌. ఇందులో ప్రతిరోజూ 3 జీబ డేటా హై స్పీడ్‌ నెట్‌తో 84 రోజుల వరకు వర్తిస్తుంది.అంటే  మొత్తం ఈ ప్లాన్‌లో 252 జీబీ డేటా ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ సమయంలో పొందుతారు. కేవలం రూ.214 రీఛార్జీ చేసుకుంటే ఒక నెలపాటు ప్రతిరోజూ 3 జీబీ డేటా పొందుతారు.

5 /5

ఒక వార్త పత్రిక నివేదిక ప్రకారం బీఎస్‌ఎన్‌ఎల్ ఆంధ్రప్రదేశ్‌ ప్రిన్సిపల్‌ జనరల్‌ మేనేజర్‌ ఎల్‌ శ్రీను ఇటీవల ఒక మీటింగ్‌లో బీఎస్‌ఎన్‌ఎల్ 5జీ సర్వీసులను కూడా 2025 సంక్రాంతి వరకు ప్రారంభించనుందని తెలిపారు. ఇప్పటికే వివిధ ప్రధాన ప్రాంతాల్లో ఈ కంపెనీ టవర్లను ఏర్పాటు చేస్తోంది. బీఎస్‌ఎన్‌ఎల్ 4జీ టెక్నాలజీ టాటా కన్సల్టెన్సీ సర్వీస్‌  సప్లై చేస్తోంది.