బులియన్ మార్కెట్లో గత రెండు వారాలుగా బంగారం ధరలు, వెండి ధరలు పతనమవుతున్నాయి. బంగారంతో పోటీపడి మరీ పెరిగిన వెండి ధర తాజాగా రికార్డు స్థాయిలో దిగొచ్చింది. ఢిల్లీలో, హైదరాబాద్లో వెండి ధర ఒకేలా ఉంది.
Gold Rate Update 29th January 2021: బులియన్ మార్కెట్లో గత రెండు వారాలుగా బంగారం ధరలు, వెండి ధరలు పతనమవుతున్నాయి. బంగారంతో పోటీపడి మరీ పెరిగిన వెండి ధర తాజాగా రికార్డు స్థాయిలో దిగొచ్చింది. ఢిల్లీలో, హైదరాబాద్లో వెండి ధర ఒకేలా ఉంది.
బులియన్ మార్కెట్లో గత రెండు వారాలుగా బంగారం ధరలు(Gold Price Today 29th January 2021), వెండి ధరలు పతనమవుతున్నాయి. తెలుగు రాష్ట్రాలలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గగా, వెండి ధరలు అమాంతం దిగొచ్చాయి. Also Read: WhatsApp Chat: మీ వాట్సాప్ ఛాటింగ్ డేటాను Telegram Appకు ఇలా ట్రాన్స్ఫర్ చేసుకోండి
తెలుగు రాష్ట్రాల్లోని విజయవాడ, హైదరాబాద్ (Hyderabad)లలో బంగారం ధర స్వల్పంగా దిగొచ్చింది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారంపై రూ.100 మేర తగ్గడంతో 10 గ్రాముల బంగారం ధర రూ.49,800 అయింది. 22 క్యారెట్ల బంగారం సైతం రూ.100 తగ్గింది. నేడు 10 గ్రాముల బంగారం ధర రూ.46,650కి పతనమైంది.
దేశ రాజధాని ఢిల్లీలో తాజాగా రూ.110 మేర బంగారం ధర దిగొచ్చింది. దీంతో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.52,140 అయింది. అదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,800కి పతనమైంది. Also Read: New Rules from February 2021: ఫిబ్రవరి నుంచి అమల్లోకి కొత్త నియమాలు, రూల్స్ ఇవే
ఢిల్లీలో వరుసగా మూడోరోజు వెండి ధర సైతం పతనమైంది. తాజాగా వెండి ధర రూ.200 మేర దిగొచ్చింది. నేడు 1 కేజీ వెండి ధర రూ.66,000కి క్షీణించింది. తెలుగు రాష్ట్రాల్లో వెండి ధర రికార్డు స్థాయిలో రూ.4,700 మేర క్షీణించింది. ఏపీ, తెలంగాణ మార్కెట్లలో 1 కేజీ వెండి ధర రూ.66,000కి దిగొచ్చింది. Also Read: SBI MF Retirement Benefit Scheme: మ్యూచువల్ ఫండ్ రిటైర్మెంట్ బెనిఫిట్ స్కీమ్ ప్రారంభించిన SBI