Facepack for Glowing Skin: ఈ ఫేస్ ప్యాక్ ఖరీదైన ఫేషియల్స్ కంటే ముఖంపై మరింత మెరుపు తెస్తుంది..

Facepack for Glowing Skin: ఏవైనా పెళ్లిళ్లు పార్టీలోకి వెళ్తే ఫేషియల్‌ చేసుకోవడం అలవాటు. దీంతో ముఖం గ్లోయిగా కనిపిస్తుంది అయితే ఒక్కోసారి వీటి సైడ్ ఎఫెక్ట్స్ వల్ల ముఖంపై చికాకుగా ఉంటుంది. కొన్ని రకాల పదార్థాలు ఇంట్లోనే మనం గోల్డెన్ గ్లో వచ్చే ఫేషియల్ తయారు చేసుకోవచ్చు అది ఏంటో తెలుసుకుందాం.
 

1 /5

ముఖంపై పార్లర్ కంటే గ్లో రావాలంటే మూల్తానా మట్టితో ఫేస్ ప్యాక్ వేసుకోండి. ఒక స్పూన్ ముల్తానా మట్టి, ఒక స్పూన్ అలోవెరా జెల్ రోజ్ వాటర్ వేసి ఫేస్ ప్యాక్ వేసుకోవాలి. రోజ్‌ వాటర్‌కు బదులు పాలు కూడా వినియోగించవచ్చు.  

2 /5

ఈ ఫేస్‌ ప్యాక్‌ అరగంట పాటు వేసుకోవాలి. ఆ తర్వాత ఫేస్ ప్యాక్ ఆరిపోతుంది నార్మల్ వాటర్ తో ఫేస్ ప్యాక్ శుభ్రం చేసుకోవాలి.ఈ ప్యాక్‌ వారానికి రెండు సార్లు వేసుకుంటే మంచిది.  

3 /5

మీ ముఖానికి అందమైన గ్లో రావాలంటే అవిస గింజలతో కూడా ఫేస్ ప్యాక్ వేసుకోవచ్చు. దీనికి కావాల్సిందల్లా అవిసగింజలు పొడి బియ్యం పిండి తీసుకొని పేస్టు మాదిరి తయారు చేసుకుని ముఖానికి అప్లై చేయాలి. ఇలా చేయడం వల్ల చంద్రబింబంలా కనిపిస్తుంది.  

4 /5

ఈ రెండు వస్తువులతో ఫేస్ ప్యాక్ వేసుకోవడం వల్ల ముఖరంగు మెరుగవుతుంది ఏ సైడ్ ఎఫెక్ట్స్ ఉండకుండా పార్లర్ కంటే మంచి గ్లో మీ ముఖంపై కనిపిస్తుంది.  

5 /5

ఈ వస్తువులతో ముఖంపై గ్లో తోపాటు చర్మం బిగుతుగా మారుతుంది. దీంతో మీ ముఖం పార్లర్‌ వంటి గ్లో వస్తుంది. ఏ సైడ్‌ ఎఫెక్ట్స్‌ లేకుండానే పెళ్లిళ్లు, పార్టీల్లో వెలిగిపోతారు.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )