EPFO Good News: జాబ్ మానేశాక EPF ఖాతా నుంచి నగదు డ్రా చేయవద్దు, ఆ కారణాలు మీకోసం

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ యాక్టివ్‌గా లేని ఈపీఎఫ్ ఖాతాలపై సైతం కొన్నేళ్లపాటు వడ్డీని అందిస్తుంది. ఎవరైనా ఉద్యోగం మానేస్తే  ఈపీఎస్ ఖాతాలో నగదు విత్‌డ్రా చేయకపోతే మూడేళ్లపాటు వడ్డీని అందుకోవచ్చు.

EPFO Latest Update: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ యాక్టివ్‌గా లేని ఈపీఎఫ్ ఖాతాలపై సైతం కొన్నేళ్లపాటు వడ్డీని అందిస్తుంది. ఎవరైనా ఉద్యోగం మానేస్తే  ఈపీఎస్ ఖాతాలో నగదు విత్‌డ్రా చేయకపోతే మూడేళ్లపాటు వడ్డీని అందుకోవచ్చు.

1 /5

EPFO Latest News: ఏదైనా ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగులకు ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలు ఉంటే వారికి కొన్ని ప్రయోజనాలు అందుతాయి. ఇందుకోసం సంస్థలోని ఉద్యోగుల జీతం నుండి  కొంత మేర PF కిందకి వెళ్తుంది. మీ జీతం నుండి కట్ అయిన పీఎఫ్ మొత్తానికి ప్రభుత్వం వడ్డీని చెల్లిస్తుంది. కానీ కొంతమంది ఉద్యోగం మారిన వెంటనే EPF ఖాతా నుండి డబ్బును విత్‌డ్రా చేసుకుంటారు. అయితే మీరు ఈ విషయాన్ని తెలుసుకుంటే ఉద్యోగం మారిన వెంటనే పీఎఫ్ నగదు విత్ డ్రా చేయకూడదని నిర్ణయించుకుంటారు. Also Read: EPFO: ఈపీఎఫ్ ఖాతాదారులు ఒక్క మిస్డ్ కాల్ ద్వారా EPF Balance వివరాలు పొందవచ్చని తెలుసా

2 /5

ఈపీఎఫ్‌వో(EPFO) ప్రకారం, ఉద్యోగాలు మారితే ఏ ఉద్యోగి కూడా వారి పీఎఫ్ ఖాతాలోని నగదును విత్‌డ్రా చేసుకోరాదు. కానీ ఓ వాస్తవం గ్రహించకుండా జాబ్ మానేసిన వెంటనే పీఎఫ్ నగదు ఉపసంహరించుకుంటారు. దీనికి కారణం.. జాబ్ మానేసిన తరువాత ఈపీఎఫ్ ఖాతాలో నగదుకు వడ్డీ లభించదని ఉద్యోగులు భావించడం. అయితే EPFO నిబంధనల ప్రకారం, ఉద్యోగాన్ని వదిలివేసిన తరువాత కూడా ఖాతాలోని నగదుకు ఈపీఎఫ్ వడ్డీ అందుతూనే ఉంది. Also Read: EPF Interest Rate: EPFO ఖాతాదారులకు కేంద్రం శుభవార్త, 6 కోట్ల మంది హర్షం

3 /5

యాక్టివ్‌గా లేని ఈపీఎఫ్ ఖాతాలకు కూడా ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ 3 సంవత్సరాలపాటు వడ్డీని చెల్లిస్తుంది. ఒక ఉద్యోగి ఉద్యోగం మానేసిన తర్వాత EPF ఖాతాను క్లియర్ చేయకపోతే, EPFO ఆ ఖాతాలపై 3 సంవత్సరాలు వడ్డీని చెల్లిస్తుంది. ఈపీఎఫ్ అకౌంట్ ఖాళీ చేస్తే, మీరు చేస్తున్న పొదుపుతో పాటు పెన్షన్ పథకం కూడా ప్రభావితమవుతుంది. అందువల్ల, పీఎప్ ఖాతాలో నగదు పూర్తిగా విత్‌డ్రా చేయకూడదు. ఉద్యోగాన్ని మార్చినప్పుడు, కొత్త కంపెనీలోని పాత ఖాతా గురించి సమాచారం ఇవ్వాలి. Also Read: EPFO: ఈపీఎఫ్ ట్రాన్స్‌ఫర్ సులువుగా చేసుకోవచ్చు, PF Transfer Online పూర్తి ప్రక్రియ ఇదే

4 /5

ఇటీవల కేంద్ర ప్రభుత్వం 2020-21 సంవత్సరానికి కొత్త పీఎఫ్ వడ్డీ రేట్లను ప్రకటించింది. కరోనా వైరస్ కారణంగా గత ఏడాది ఇబ్బంది ఎదుర్కొన్నప్పటికీ ఈపీఎఫ్ ఖాతాదారుల వడ్డీలో కోత విధించడం లేదని స్పష్టం చేసింది. ఈపీఎఫ్ వడ్డీ రేటును 8.5 శాతంగా యథాతథంగా ఉంచుతున్నట్లు ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో 6 కోట్ల ఈపీఎఫ్‌వో సభ్యులకు ప్రయోజనం చేకూరుతుంది. Also Read: EPFO: 4 విధాలుగా మీ ఖాతాల్లోని PF Balanceను సులువుగా చెక్ చేసుకోవచ్చు

5 /5

ఈపీఎఫ్ ఖాతాదారుకులకు ప్రతినెలా వారి జీతంలో 12 శాతం ప్రావిడెంట్ ఫండ్‌కు చేరుతుంది. అదే సమయంలో ఉద్యోగి పనిచేస్తున్న సంస్థ, కంపెనీ సైతం అంతే మొత్తాన్ని పీఎఫ్ ఖాతాకు జమ చేయనుంది. ఈపీఎఫ్ ఖాతా నగదుకు ప్రభుత్వం వడ్డీని చెల్లిస్తుంది. ప్రస్తుతం ఈపీఎఫ్ ఖాతాలకు 8.50 శాతం వడ్డీ ఇస్తున్నారు. ఈ వడ్డీ రేటు ఇతర సేవింగ్ అకౌంట్స్ కన్నా బెటర్. ఈ కారణంగా ఉద్యోగులు చాలా అవసరం ఉన్న సమయంలో మాత్రమే పీఎఫ్ ఖాతా నుండి నగదును విత్‌డ్రా చేసుకోవాలని ఈపీఎఫ్‌వో సూచిస్తుంది. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి. Android Link - https://bit.ly/3hDyh4G Apple Link - https://apple.co/3loQYe మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook