NECC EGG Rate: ఈ దేశాలలో కోడిగుడ్ల ధరలు వింటే షాక్.. ఒక్క క్రేట్ రేటు ఎంతంటే..?

EGG Price In Hyderabad: మన దేశంలో కోడిగుడ్డు 5 నుంచి 6 రూపాయలలోపు దొరుకుతుంది. కానీ కొన్ని దేశాలలో ఒక క్రేట్ ధర ఎగ్స్ కొనుగోలు చేయాలంటే.. భారీగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. వివిధ దేశాలలో గుడ్ల ధర ఒక్కో విధంగా ఉంది. ఏ దేశాలలో కోడి గుడ్లు ఎంత ధరలో ఉన్నాయంటే..?
 

  • Oct 06, 2023, 09:41 AM IST
1 /5

వరల్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఒక్కో క్రేట్ గుడ్ల ధరను డాలర్లలో పంచుకుంది. దీని ప్రకారం.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన గుడ్డు స్విట్జర్లాండ్‌లో, చౌకైన గుడ్డు మన దేశంలో దొరుకుతోంది.  

2 /5

స్విట్జర్లాండ్‌లో గుడ్లు కొనాలంటే అత్యధిక ధర చెల్లించాలి. ఇక్కడ క్రేట్ ధర ఎగ్స్ కొనుగోలు చేయాలంటే.. 7 డాలర్లు అంటే రూ.550 కంటే ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది.  

3 /5

న్యూజిలాండ్‌లో 5.43 డాలర్లు, డెన్మార్క్ 4.27, ఉరుగ్వేలో 4.07, అమెరికాలో 4.31 డాలర్లకు క్రేట్ గుడ్లు లభిస్తున్నాయి. ఈ దేశాల్లో భారతీయ కరెన్సీ ప్రకారం.. మీరు ఒక క్రేట్ కోసం రూ.350 వరకు చెల్లించాలి.  

4 /5

ప్రపంచంలోనే అత్యంత చౌకగా గుడ్డు మన దేశంలోనే లభిస్తుంది. ఇక్కడ ఒక క్రేట్ ధర 78 రూపాయల వరకు ఉంది. అంటే ఒక్క గుడ్డుకు దాదాపు రూ.6 చెల్లించాలి.  

5 /5

రష్యాలో 1.01 డాలర్, పాకిస్థాన్‌లో 1.05 డాలర్, ఇరాన్‌లో 1.15 డాలర్, బంగ్లాదేశ్‌లో 1.12 డాలర్‌కి గుడ్లు అందుబాటులో ఉన్నాయి. అంటే ఈ దేశాల్లో ఒక్కో క్రేట్‌కు భారతీయ కరెన్సీలో దాదాపు రూ.100 వెచ్చించాల్సి ఉంటుంది.