Dussehra Navratri 2024: దేవీ నవరాత్రి ఉత్సవాలు ఎంతో వేడుకగా ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో భక్తులు కొన్ని పొరపాట్లు చేయోద్దని కూడా పండితులు చెబుతున్నారు.
ప్రస్తుతం దుర్గాదేవీ నవరాత్రి ఉత్సవాలు ఎంతో వేడుకగా జరుగుతున్నాయి. అక్టోబరు 3 నుంచి 12 వరకు శరన్నావరాత్రి ఉత్సవాలను ఎంతో వేడుకగా నిర్వహిస్తారు. ముఖ్యంగా నవరాత్రులలో దుర్గామ్మ తొమ్మిది అవతారలలో భక్తులకు దర్శనమిస్తుంటారు.
దుర్గాదేవీ మహిషా సురుడ్ని దశమి రోజున సంహరించింది. అందుకు గుర్తుగా విజయదశమిని మనం జరుపుకుంటాం. అదే విధంగా రాముడు కూడా ఇదే రోజున రావాణాసురుడ్ని సంహారించాని చెబుతారు. పాండువులకు తిరిగి వారి రాజ్యం ఇదే రోజున లభించిందంట.
చెడుపై మంచి గెలిచినందుకు గుర్తుగా దసరాను జరుపుకుంటాం. అయితే.. దసరా నేపథ్యంలో అమ్మవారు తొమ్మిది రోజుల్లో, తొమ్మిది అవతారాల్లో భక్తులకు దర్శమిస్తుంటారు. అందుకే చాలా మంది భక్తులు ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తారు.
దుర్గా ఉత్సవాలలో.. భక్తులు దుర్గా దేవిని, తొమ్మిది రూపాలను పూజిస్తారు - శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట, కూష్మాండ, స్కందమాత, కాత్యాయని, కాళరాత్రి, మహాగౌరి, సిద్ధిదాత్రి అవతారాలలో పూజించుకుంటారు.
ఈ నేపథ్యంలో దుర్గా దేవీ నవరాత్రులలో కొన్ని పొరపాట్లు మాత్రం అస్సలు చేయకూడదని పండితులు చెబుతున్నారు. మెయిన్ గా అమ్మవారి ఉపాసన తీసుకున్న వారు మద్యపానానికి దూరంగా ఉండాలి. జూదం అలవాట్లకు దూరంగా ఉండాలి. మద్య, మాంసాంలను అస్సలు ముట్టుకోకూడదు. ఉల్లి, వెల్లూల్లీలకు కూడా దూరంగా ఉండాలి.
నవరాత్రులలో చాలా మంది ప్రత్యేకంగా ఉపవాసాలు ఉంటారు. దేవీ ఉపాసన సమయంలో చెడు మాటలకు, చెడు వ్యాఖ్యలకు దూరంగా ఉండాలి. అంతేకాకుండా.. ఎవరిని గురించి చెడుగా మాట్లాడకూడదు. ఒకర్ని గురించి నిందించడం వంటి పనులు చేయకూడదు.
ఎప్పుడు అమ్మవారిని స్మరించుకుంటూ, మంచి జరగాలని మాత్రం ప్రార్థించాలి. ఇలా తొమ్మిది రోజుల పాటు భక్తితో పూజించుకుంటే.. అమ్మవారి అనుగ్రహాం వల్ల మంచి జరుగుతుందని పండితులు చెబుతున్నారు. (Disclimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం సోషల్ మీడియా వైరల్ కంటెంట్ ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)