Rahul Dravid Niece Aditi Dravid: రాహుల్ ద్రావిడ్ మేనకోడలు ఎవరో తెలుసా..! ఆ భామకు బుల్లితెరపై స్పెషల్ క్రేజ్

Who is Aditi Dravid: టీమిండియా హెడ్ కోచ్ పదవికి రాహుల్ ద్రావిడ్ స్థానంలో గౌతమ్ గంభీర్ ఎంపికయ్యారు. శ్రీలంక టూర్‌ నుంచి గంభీర్ కోచ్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. కోచ్‌గా పదవి కాలం పొడగించేందుకు బీసీసీఐ సిద్ధంగా ఉన్నా.. ద్రావిడ్ మాత్రం సున్నితంగా తిరస్కరించారు. ఇటీవల టీ20 వరల్డ్ కప్ విజయంతో రాహుల్ ద్రావిడ్ విజయవంతంగా తన ప్రయాణాన్ని ముగించారు. ఇక రాహుల్ ద్రావిడ్ మేనకోడలు ఓ ఫేమస్ టీవీ స్టార్ అని చాలామందికి తెలియదు. ఆమె ఎవరంటే..?
 

1 /5

రాహుల్ ద్రావిడ్ మేనకోడలు పేరు అదితి ద్రవిడ్. ఆమె పూర్తి పేరు అదితి వినాయక్ ద్రావిడ్. మహారాష్ట్రలోని పూణేలో జన్మించిన ఆమె.. ప్రస్తుతం ముంబైలో నివాసం ఉంటోంది.  

2 /5

అదితి ద్రావిడ్ పూణేలోని అభినవ విద్యాలయంలో పాఠశాల విద్యను కంప్లీట్ చేసింది. బీఎంసీసీ కళాశాల విద్యను పూర్తి చేశారు.   

3 /5

అదితి "మజ్యా నవ్రాచి బోయ్కో"తో మరాఠీ టీవీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. డా.అంబేద్కర్, సుంద్ర మనమధ్య భారాలి వంటి ప్రముఖ సీరియల్స్‌లో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.  

4 /5

అదితి ద్రావిడ్ సోషల్ మీడియాలో తెగ యాక్టివ్‌గా ఉంటుంది. తన మామ రాహుల్ ద్రావిడ్‌తో ఉన్న పిక్స్‌ను తరచుగా షేర్ చేస్తుంటుంది.  

5 /5

ఇక రీసెంట్‌గా టీమిండియా వరల్డ్ కప్ గెలిచిన సమయంలో అదితి సంబరాలు భారీగా చేసుకుంది. ఇటు నటిగా.. అటు సోషల్ మీడియాలో స్పెషల్ క్రేజ్‌తో దూసుకుపోతుంది.