Effects of lack of Sleep | నిద్ర అనేది ప్రతి వ్యక్తికి చాలా అవసరం. ప్రస్తుతం పరుగెత్తుతున్న పోటీ ప్రపంచంలో ముందుకు సాగాలంటే ఆరోగ్యంపై శ్రద్ద వహించాలి. నిద్రలేమి సమస్యలతో బాధపడేవారు రాణించలేకపోతున్నారని అధ్యయనాలు చెబుతున్నారు. రోజుకు 7 గంటల నుంచి 8 గంటల వరకు నిద్రిస్తే త్వరగా అనారోగ్యం బారిన పడకుండా ఉంటాం. నిద్రలేమి వల్ల డిప్రెషన్ సమస్యకు గురవుతుంటాం. డిప్రెషన్ తర్వాత తీసుకునే నిర్ణయాలను కూడా మనం ఊహించలేం.

తగినన్ని గంటలు నిద్రించని వారిలో ఊబకాయం (Obesity), బరువు పెరగటం వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. అందుకు రాత్రిపూట త్వరగా నిద్రపోయి ఉదయం వేకువ జామున లేచినా ప్రయోజనం ఉంటుంది.
జ్ఞాపకశక్తి తగ్గుతుంది. చదువులో వెనకబడిపోయామని ఆందోళన అధికం అవుతుంది. అయితే తల్లిదండ్రుల మాట విని వేళకు నిద్రపోవాలని విద్యార్థులకు సూచిస్తున్నారు.
నిద్రలేమి, తక్కువ సమయం నిద్రించడం వల్ల మెదడుపై తీవ్ర ప్రభావం ఉంటుంది. శరీరానికి సరిపడా ఆక్సిజన్ లభించక ఒత్తిడి పెరుగుతుంది. మెదడుకు సంబంధించి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు వస్తాయి. సరిగ్గా ఆలోచించలేకపోతాం. పరిస్థితులను సరిగ్గా అర్థం చేసుకోలేని కండీషన్కు చేరుకుంటాం.