Rules for Tulasi Plant: మీ ఇంట్లో తులసిమొక్క ఉందా? ఈ నియమం తప్పనిసరిగా తెలుసుకోండి..

Rules for Tulasi Plant: హిందూ సంప్రదాయంలో ప్రతి ఒక్కరూ తులసి చెట్టును తమ ఇళ్లలో కచ్చితంగా నాటుకుంటారు. ప్రతిరోజూ తులసిమాతను పూజిస్తారు. ఎందుకంటే తులసిచెట్టులో విష్ణుమూర్తి లక్ష్మీదేవిలు కొలువై ఉంటారని నమ్ముతారు.

Rules for Tulasi Plant: హిందూ సంప్రదాయంలో ప్రతి ఒక్కరూ తులసి చెట్టును తమ ఇళ్లలో కచ్చితంగా నాటుకుంటారు. ప్రతిరోజూ తులసిమాతను పూజిస్తారు. ఎందుకంటే తులసిచెట్టులో విష్ణుమూర్తి లక్ష్మీదేవిలు కొలువై ఉంటారని నమ్ముతారు. అయితే, తులసి చెట్టును పెంచుకునే ముందు వాటికి కొన్ని నియమాలు ఉంటాయి. వాటిని తప్పకుండా ఆచరించాలి. లేదంటే దాని పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. చివరికి రోడ్డున పడే పరిస్థితి ఏర్పడుతుంది.
 

1 /7

సాధారణంగా మనం తులసి చెట్టును మన ఇంటి పరిసరాల్లో ఏర్పాటు చేసుకుంటాం. అయితే, తులసి చెట్టు ఆకులు నేలపై పడతాయి. వాటిని తొక్కకూడదు. వాటి కొమ్మలను కూడా ఎక్కడంటే అక్కడ పాడేయకూడదు. వాటిని చెట్టులోని మట్టిలోనే పూడ్చాలి.   

2 /7

ఒక్కోసారి ఇంట్లో మనం పెట్టుకున్న తులసి చెట్టు ఎండిపోతుంది. అయితే అలాంటి చెట్టును ఇంట్లో పెట్టకూడదు. దాన్ని వెంటనే మార్చేయాలి. ఆ ప్రదేశంలో కొత్త మొక్కను నాటుకోవాలి. ఎందుకంటే ఇది ఇంటికి దురదృష్టాన్ని తీసుకువస్తుంది.  

3 /7

తులసిచెట్టును ఎట్టిపరిస్థితుల్లో చీకట్లో పెట్టకూడదు. బాగా ఎండ ఉండే ప్రదేశంలో ఏర్పాటు చేసుకోవాలి. చివరికి సంధ్య సమయంలో కూడా తులసి చెట్టు వద్ద ఒక దీపాన్ని వెలిగించాలి. ఇలా చేస్తే పరోక్షంగా తులసి మాతకు వెలుగు వస్తుంది.తులసి మొక్కను నేరుగా ఎండ పడే ప్రదేశంలో ఏర్పాటు చేసుకోవాలి.   

4 /7

ముఖ్యంగా ఇంట్లో తులసిచెట్టును ఏర్పాటు చేసుకునేటప్పుడు దిశకు కూడా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. తులసి మొక్కను దక్షిణం లేదా ఆగ్నేయ దిశలో ఎట్టిపరిస్థితుల్లో పెంచకూడదు. ఇది ఆగ్నికి సంబంధించినది. తులసి మొక్కను ఉత్తరం లేదా ఈశాన్య మూలలో నాటుకోవాలి.   

5 /7

తులసి మొక్కను స్నానం చేయకుండా ముట్టకూడదు.ఇలా ఆకులను కోయకూడదు. స్నానం చేయకుండా పూజ కూడా చేయకూడదు.  

6 /7

ఎట్టిపరిస్థితుల్లో తులసి మొక్కకు ఆదివారం నీటిని సమర్పించకూడదు. ఇది అశుభం. ముఖ్యంగా ఈరోజు తులసి ఆకులను కోయకూడదు కూడా. సంధ్య సమయంలో కూడా ఆకులను కోయకూడదు. అయితే, తులసి ఆకులను కోసేటప్పుడు చేతి వేళ్లతోనే కోయాలి. కత్తి వంటివి వాడకూడదు. అంతేకాదు తులసి మొక్కను నేల మీద నాటకూడదు. ఒక కుండలో మాత్రమే తులసిమొక్కను నాటాలి.  

7 /7

తులసి మొక్క చుట్టుపక్క పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా ముళ్లమొక్కలను తులసి చెట్టు పక్కన పొరపాటున కూడా పెట్టకూడదు.(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)