Samantha: శోభితను తీసుకొచ్చి పెట్టింది సమంతానే... చివరికి ఆమెకే మోసం..?

Sobhita Vs Samantha: టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా గుర్తింపు సొంతం చేసుకుంది సమంత. అతి తక్కువ సమయంలోనే పాన్ ఇండియా హీరోయిన్ గా మారిపోయింది. చాలామంది స్టార్ హీరోలతో కలిసి నటించిన ఈ ముద్దుగుమ్మ కెరియర్ పరంగా సక్సెస్ అందుకుంది. కానీ వ్యక్తిగతంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. 

1 /5

2017లో నాగచైతన్యతో ఏడడుగులు వేసిన సమంత అంతకుముందు ఏడేళ్ల పాటు ఆయన ప్రేమలో మునిగి తేలింది. పెళ్లి అయితే జరిగింది కానీ ఎక్కువ కాలం ఆ బంధాన్ని నిలుపుకోలేకపోయారు. అలా 2021 అక్టోబర్ రెండవ తేదీన విడాకులు ప్రకటించారు.  వీరి విడాకులతో ఇండస్ట్రీ మొత్తం ఉలిక్కిపడింది. ఎంతో అన్యోన్యంగా ఉన్న ఈ జంట సడన్గా విడాకులు ప్రకటించేసరికి ఎవరు జీర్ణించుకోలేకపోయారు. 

2 /5

ఇకపోతే గతంలో సమంత,  నాగచైతన్య విడిపోయినప్పుడు విడాకులకు కారణం సమంత అని సమంత పైన చాలామంది రకరకాల రూమర్స్ గుప్పించారు. కానీ ఇప్పుడు సడన్గా నాగచైతన్య శోభితతో ప్రేమలో పడడం, ఆమెతో పెళ్లికి సిద్ధం అవ్వడం చూసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు నాగచైతన్య వివాహం చేసుకోబోయే అమ్మాయి శోభిత సినీ కెరియర్ కి ఒకప్పుడు సమంత ఎంతో సహాయపడింది అలాంటి సమంతకే ఇప్పుడు అన్యాయం చేసింది శోభిత. 

3 /5

తాజాగా సమంత శోభిత కెరియర్ కు హెల్ప్ చేస్తూ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అసలు విషయంలోకి వెళ్తే.. 2018లో శోభిత నటించిన ఒక సినిమా టీజర్ లాంఛ్ కి సమంత హాజరైంది. 

4 /5

అప్పటికి నాగచైతన్య తో  వివాహమైన విషయం తెలిసింది. ఇక శోభిత గురించి మాట్లాడుతూ ఆమె చాలా అద్భుతంగా నటించింది.  సినిమా కూడా చాలా బాగుంది. ఈ టీజర్ లాంచ్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది అంటూ శోభితపై ప్రశంసల వర్షం కురిపిస్తూ సమంత కామెంట్లు చేసింది.   

5 /5

ఇక తర్వాత అదే రోజు శోభిత కూడా మాట్లాడుతూ.. ఆమె చాలా మంచి అమ్మాయి.  అటు సోషల్ మీడియా లో కూడా ఎప్పుడు అందరికీ సపోర్టుగానే మాట్లాడుతుంది. ఆమెను కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ ఆరోజు చెప్పింది. అయితే అలా చెప్పిన శోభిత ఇప్పుడు ఆమెనే మోసం చేస్తూ ఆమె భర్తని వివాహం చేసుకోబోతుండడం చూసి నెటిజన్స్ సైతం ఫైర్ అవుతున్నారు.