naga chaitanya sobhita Dhulipala: అక్కినేని నాగచైతన్య, శోభితా దూళిపాళ్ల నిశ్చితార్థం ఎంతో వేడుకగా జరిగింది. ఈ క్రమంలో.. నాగార్జున కుటుంబం, ఆయన అభిమానులు ఫుల్ ఖుల్ లో ఉన్నారు. ప్రస్తుతం నెటిజన్లు శోభితా ధూళి పాల్ల గురించి తెలుసుకొవడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు.
నాగచైతన్య, శోభితా ఎంగెజ్ మెంట్ గ్రాండ్ జరిగింది. ఈరోజు ఉదయంపూట కొద్ది మంది బంధువులు, స్నేహితుల మధ్య వీరి ఎంగెజ్ మెంట్ కార్యక్రమం జరిగింది. కొంత కాలంగా వీరిద్దరు కూడా రిలేషషన్ లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ఇద్దరు కూడ వీటిని రూమర్స్ అంటూకొట్టి పారేశారు.
కానీ అందరు అనుకున్నట్లుగానే నాగచైతన్య, శోభితాలు తొందరలోనే పెళ్లి బంధంతో ఒక్కటవ్వనున్నారు. ఈక్రమంలో ఎంగెజ్ మెంట్ వేడుక వైభవంగాజరిగింది. అక్కినేని నాగార్జున వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలను ఎక్స్ వేదికగా పోస్ట్ చేసి కోత్త జంటను ఆశీర్వదించారు. అక్కినేని ఫ్యామిలీ అభిమానులు కూడా స్పెషల్ గా విషేస్ చెప్పారు.
ప్రస్తుతం అక్కినేని ఫ్యామిలీకి కోడలుగా రాబోతున్న శోభితా గురించి తెలుసుకునేందుకు నెటిజన్లు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు.ఈ క్రమంలో శోభితా తెనాలికి చెందిన అమ్మాయి. పూర్తిగా పెరిగి పెద్దైంది మాత్రం వైజాగ్ లో.. ఈమె తండ్రి..వేణుగోపాల్ రావ్.. నేవీలో పనిచేసేవారు. తల్లి శాంతాదేవీ టీచర్.
శోభితా మిస్ ఇండియా 2013 రన్నరప్ గా నిలిచింది. గూఢాచారిలో నటించి ఆమె ఎంట్రీ ఇచ్చారు.దేవ్ పటేల్ తో కలిసి మంకీ మ్యాన్ లో నటించారు. మరోవైపు శోభితా పూర్తిగా వెజీటెరియన్ అంట.తన వంటను తానే చేసుకుంటుందంట. భరత్ నాట్యం , గిటార్ లలో కూడా మంచి ప్రావీణ్యం కల్గి ఉన్నారంట.
శోభితా ధూళిపాళ్ల అనేక బోల్డ్ హీరోయిన్ అని తెలుస్తోంది. ఆమె స్లమ్ డాగ్ మిలీయనీర్ ఫెమ్.. దేవ్ పటేల్ హీరో నటించిన హలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ మంకీ మ్యాన్ మూవీలో ఈ బ్యూటీ ఒక సీతా అనే పేరుతో వేశ్యపాత్రలో నటించారు.
ఇదిలా ఉండగా.. గతంలో సమంతా ది ఫ్యామిలీ మ్యాన్ 2 లో బోల్డ్ పాత్రలో నటించడం వల్ల గోడవలు జరిగి డైవర్స్ అయ్యాయని చెబుతుంటారు. పొన్నియన్ సెల్వన్, ఐ అండ్ 2, మేడ్ హెవెన్ మూవీలతో ఈ భామ మంచి గుర్తింపు తెచ్చుకుంది. మంకీ మ్యాన్ మూవీ భారత్ తో ఇంకా విడుదల కాలేదు. ఈ సినిమాకు దేవ్ పటేల్ దర్శకత్వం వహించారు..
ఈ మూవీ హనుమంతుడి ఇతిహసంతో సంబంధం కల్గి ఉంది. జోర్డెన్ పీలే దీన్ని నిర్మించారు. ధూళిపాళ అంతర్జాతీయ తెరపైకి అరంగేట్రం చేస్తూ ఏప్రిల్ 5న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శించబడింది. అయితే, భారతదేశంలో దీని విడుదల నిజానికి ఏప్రిల్ 19న జరగాల్సి ఉంది. కానీ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) నుండి అనుమతి ఇంకాపెండింగ్‌లో ఉంది.