Do Not Touch Tulasi Plant: మన హిందూ మతంలో వారంలో ప్రతిరోజూ ఒక్కో దేవుడికి అంకితం చేశారు. అందులో ముఖ్యంగా శుక్రవారం అంటేనే లక్ష్మిపూజ. ఈరోజు తులసి మాతకు కూడా పూజిస్తారు. అయితే, తులసి మాతను ఓ రెండు రోజులు పొరపాటున కూడా తాకకూడదు. ఇది అశుభం అవి ఎప్పుడెప్పుడో తెలుసా?
తులసి మొక్క అంటేనే లక్ష్మీదేవి అని అర్థం. ఆ మొక్కలో లక్ష్మీదేవి నివసిస్తుంది. అందుకే ప్రతి గురు, శుక్రవారాల్లో తులసి కోటకు కూడా పూజలు చేస్తారు. అంతేకాదు అందరి ఇళ్లలో తులసి మొక్కను కచ్చితంగా ఏర్పాటు చేసుకుంటారు.
తులసి మొక్క ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఇంట్లో ఉండే నెగిటివిటీ తగ్గిపోతుంది. ఆ ఇంట్లో ఉన్నవారు కూడా ఆర్థిక సంక్షోభం నుంచి త్వరగా బయటపడతారు. కెరీర్‌లో కూడా సక్సెస్ సాధిస్తారు. సైన్స్ పరంగా కూడా తులసి మొక్క ఇంటి దగ్గర పెట్టుకోవడం వల్ల కూడా ఇంట్లోకి దోమలు, ఇతర కీటకాలు రావు.
అయితే, వాస్తు ప్రకారం మాత్రమే తులసి చెట్టును ఏర్పాటు చేసుకోవాలి. ఇలా వాస్తు ప్రకారం ఏర్పాటు చేసుకుని తులసి మొక్కను పెట్టుకుని పూజిస్తే ఆ ఇంట్లో ఆనందం, శ్రేయస్సు వెల్లివిరుస్తుంది. కానీ, తులసి మొక్కను పూజించడానికి కొన్ని నియమాలు ఉన్నాయి. వాటిని కచ్చితంగా అనుసరించాలి.
తులసి మొక్కను ఓ రెండు రోజులు తాకకూడదు. అది ఏకాదశి, ఆదివారం. ఈ రెండు రోజులు తులసి మాతకు నీరు కూడా పెట్టకూడదు అశుభం. ఎందుకంటే ఈరోజుల్లో తులసి అమ్మవారు ఉపవాసం ఉంటారు. విష్ణువు కోసం ఈ రెండు రోజులు ఆమె ఉపవాసం పాటిస్తారు కాబట్టి ఈ రోజు ఆమెకు నీరు పెడితే ఆగ్రహిస్తుంది. పొరపాటున కూడా తాకకుండా జాగ్రత్త వహించాలి.
ఇలా చేయడం వల్ల తులసి మాత ఆగ్రహించి వారి ఇల్లు వదిలి వెళ్లిపోతుందని అంటారు. అంతేకాదు తులసి మొక్కకు నీరు పెట్టేటప్పుడు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా రాత్రి, పగలు నీరు పోయకూడదు. కేవలం ఉదయం మాత్రమే పెట్టాలి.(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)