Money Plant Vastu: మనీప్లాంట్‌ మొక్క ఈ మూలన పెడితే ధనలక్ష్మి కటాక్షమే.. !

Money Plant Vastu: మనీ ప్లాంట్ మొక్క మనందరి ఇళ్లలో అందుబాటులో ఉంటుంది. హిందూమతంలో ఎక్కువ మంది పెంచుతారు దీంతో ధనాకర్షణ కలుగుతుందని నమ్ముతారు. అయితే మనీ ప్లాంట్ మొక్కను ఏ దిశలో పెంచుకోవాలి ఎలా మనకు కలిసి వస్తుందో వాస్తు ప్రకారం తెలుసుకుందాం.
 

1 /7

ఈ దిశలో పెట్టకూడదు..  ముఖ్యంగా మనీ ప్లాంట్ మొక్కను తూర్పు లేదా పడమర దిశలో పెట్టకూడదు ఇది సమస్యలను తీసుకువస్తుంది ముఖ్యంగా వైవాహిక జీవితంలో సమస్యలను తీసుకువస్తుంది. మనీ ప్లాంట్ మొక్క ఇది దిశల్లో ఉండకుండా చూసుకోండి. ఈశాన్య మూలలో పెంచుకోవచ్చు.

2 /7

ఎర్రని వస్తువులు.. మనీ ప్లాంట్ మొక్క దగ్గరలో ఎరుపు రంగులో ఉండే వస్తువులను పెట్టకూడదు. ఇది ఇంటికి అశుభం మీకు దురదృష్టాన్ని తీసుకువస్తుంది. ఒకవేళ మీరు ఇంటి వంట గదిలో మనీ ప్లాంట్ మొక్కను పెట్టుకున్న దాని పక్కన ఎరుపు రంగులో ఉండే వస్తువులు పెట్టకూడదని గుర్తుంచుకోండి.

3 /7

మనీ ప్లాంట్ మొక్కను ఇంట్లో పెట్టుకుంటే దాని చుట్టూ ఉండే ప్రదేశం కాస్త విలాసవంతంగా ఉండేలా చూసుకోండి.  ఇరుకుగా ఉండకూడదు. మీరు ఎప్పుడైనా మనీ ప్లాంట్ మొక్కను కొనుగోలు చేసినప్పుడు వాటి ఆకులు హార్ట్ షేప్ లో ఉండేవి చూసి కొనుగోలు చేయండి ఇవి మనకు మన ఇంటికి సుఖశాంతులను తీసుకువస్తాయి.  

4 /7

అంతే కాదు ఎప్పుడైనా కానీ మనీ ప్లాంట్ మొక్క పచ్చగా ఉండేలా చూసుకోండి. ఇలా మనీ ప్లాంట్ మొక్క ఉండటం వల్ల ఇంట్లో ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. అంతేకాదు ఇంట్లో ఎప్పుడు మనీ ప్లాంట్ మొక్క పచ్చగా ఉంటానికి ఎప్పటికప్పుడు సరైన జాగ్రత్తలు తీసుకోవాలి.  

5 /7

మనీ ప్లాంట్ మొక్కలు నీళ్ళు పోయకపోతే ఇంటికి ఆర్థిక సమస్యలు వస్తాయి. సరైన మోతాదులో నీళ్లు పోస్తూ ఉండాలి అలా నీకు మోతాదులు కూడా నీళ్లు పోయకూడదు ఇలాంటి మొక్క వాడి పోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.  

6 /7

ఇంట్లో మనీ ప్లాంట్ మొక్క పెంచుకుంటే ఒక గ్లాస్ బాటిల్ లేదా జార్లో పెంచుకుంటే మంచిది సన్ లైట్ ఎక్కువగా పడకుండా జాగ్రత్తలు తీసుకోండి. మనీ ప్లాంట్ మొక్కను ఇతరులకు ఇవ్వకూడదు. వడలిపోతున్న ఆకులను తొలగించాలి ఇతరులకు మనీ ప్లాంట్ మొక్కని ఇవ్వటం వల్ల మీ ఇంట్లో ఆర్థిక సమస్యలు వస్తాయి అంటే మనీ ప్లాంట్ మొక్కను లక్ష్మీదేవితో పోలుస్తారు.  

7 /7

 ఈ వస్తువులను పెట్టండి..  మనీ ప్లాంట్ మొక్కల పక్కన బ్లూ లేదా గ్రీన్ రంగులో పెట్టుకోవచ్చు ఈ అదృష్టాన్ని తీసుకువస్తాయి లేదా గ్రీన్ రంగులో ఉండే ఫ్లాస్కు బాటిల్ లో మనీ ప్లాంట్ ను ఏర్పాటు చేసుకోవచ్చు.(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)