Diwali Bonus: ఉద్యోగులకు దీపావళి బోనస్ రూ.29,000 ప్రకటించిన సీఎం.. జీతం ఎంత పెరగనుందో తెలుసా?

Diwali Bonus to BMC Employees: కేంద్ర ప్రభుత్వం నిన్నే 7వ వేతన సంఘం డీఏ పెంచిన సంగతి తెలిసిందే. దీంతో దీపావళి ముందే కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు తీపి కబురు అందింది. అయితే మరో ప్రభుత్వం కూడా ఉద్యోగులకు బోనస్ ప్రకటించింది దీంతో దీపావళి ముందే ఉద్యోగులకు పండగే పండగ ఆ వివరాలు తెలుసుకుందాం.
 

1 /7

ఇటీవలే మహారాష్ట్ర ఎన్నికల షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ నవంబర్ లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రజలకు తీపి కబురు అందించారు సీఎం. ఎన్నికల వేళ  అత్యంత సంపన్న మున్సిపల్‌ బాడీ అయిన బీఎంసీకి దీపావళి బోనస్‌ ఉద్యోగులకు ప్రకటించారు. బృహన్‌ ముంబై మున్సిప్‌ కార్పొరేషన్‌ 53 వేల కోట్లు బడ్జెట్ కలిగి ఉంది. ఇతర రాష్ట్రాలతో కూడితే ఇదే సంపన్నమైంది.  

2 /7

బీఎంసీలో 92 వేల ఉద్యోగులు, ఆఫీసర్లు పనిచేస్తున్నారు. అయితే గతంలో దీపావళి ముందు రూ. 26వేల బోనస్ ప్రకటించిన ప్రభుత్వం, ప్రస్తుతం రూ.29వేల బోనస్ ప్రకటించి తీపి కబురు అందించింది. అంటే గతంతో పోలిస్తే 11.53% ఎక్కువ.  

3 /7

వివిధ రకాల కమిటీ ఉద్యోగులు, మున్సిపల్ కార్పొరేషన్‌ల డిమాండ్  నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది మహా ప్రభుత్వం.  

4 /7

మహారాష్ట్ర సీఎం ఏకనాథ్ షిండే, కమిషనర్  భూషణ్ గగ్రాని ఆధ్వర్యంలో జరిగిన మీటింగ్లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. బీఎంసీ కార్పొరేషన్ ఉద్యోగులు,   వివిధ రంగాల్లో పనిచేసే టీచర్లు, ప్రొఫెసర్లకు కూడా బోనస్‌ అందుకోనున్నారు.  

5 /7

 కమ్యూనిటీ హెల్త్ వర్కర్‌లకు  రూ.12 వేల బోనస్,  బాల్ వాడి లేదా కిండర్ గార్డెన్ టీచర్లకు హెల్పర్లకు రూ.5000 చొప్పున బ్రదర్‌ గిఫ్ట్ రూపంలో బోనస్ ప్రకటించింది. ఆశ వర్కర్లు కిండర్ గార్డెన్ టీచర్లకు కూడా బోనస్ ప్రకటిస్తున్నట్లు సీఎం షిండే చెప్పారు. గతంలో కంటే ఇప్పుడు రూ. 3000 అదనంగా పొందనున్నారు. గత సంవత్సరం నవంబర్ 8న దీపావళి బోనస్ గా వాళ్లకు రూ.26000 ప్రకటించారు.  

6 /7

ఇందులో ప్రధానంగా మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు, ఉద్యోగులకు రూ.29000 బోనస్‌ లభిస్తుంది. ప్రాథమిక పాఠశాలలు, ఎయిడెడ్‌ బోధనా సిబ్బంది, సెకండరీ స్కూల్ టీచర్‌, నాన్‌ టీచింగ్‌ స్టాఫ్‌కు కూడా ఈ బోనస్‌ లభిస్తుంది. ఇక సోషల్‌ హెల్త్ వాలంటీర్‌, కిండర్‌ గార్టెన్‌ టీచర్లకు బ్రదర్‌ గిఫ్ట్‌ రూ.12000, రూ.5000 బోనస్‌ ప్రకటించారు.  

7 /7

228 అసెంబ్లీ స్థానాలు కలిగి ఉన్న మహారాష్ట్ర సింగల్ ఫేస్ ఎలక్షన్ నవంబర్ 23వ తేదీన జరగనున్నాయి.  23వ తేదీ ఓట్లను లెక్కింపు చేస్తారు ఇదిలా ఉండగా గత ప్రభుత్వం సమయం నవంబర్ 20వ తారీకు ముగిస్తుంది