Worst Fruits For Diabetics: డయాబెటిస్ అనేది ప్రస్తుత కాలంలో చాలా సాధారణ సమస్య. ఈ సమస్య ఉన్నవారు ఆహారం పట్ల ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే పండ్లు విషయంలో ఏవి తినకుండా ఉండాల్సి ఉంటుంది అనేది మనం తెలుసుకుందాం.
Worst Fruits For Diabetics: డయాబెటిస్ నియంత్రణలో ఉంచడానికి ఆహారం ఒక ముఖ్యమైన అంశం. అయితే పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కానీ కొన్ని రకాల పండ్లు డయాబెటిస్ ఉన్నవారు తీసుకోవడం వల్ల మేలు కంటే కీడు అధికంగా ఉంటుంది. అయితే ఎలాంటి పండ్లు తీసుకోవడం వల్ల షుగర్ లెవల్స్ అధికంగా పెరుగుతాయి అనేది మనం తెలుసుకుందాం. దీంతో పాటు వైద్యుడు లేదా రిజిస్టర్డ్ డైటీషియన్ సలహా మేరకు ఆరోగ్యకరమైన ఆహార ప్రణాళికను అనుసరించండి.
డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు పొరపాటున కూడా ఈ పండ్లను తినకూడదు!
100 గ్రాముల అరటిపండులో 12గ్రాముల వరకు చక్కెర ఉంటుంది. కాబట్టి డయాబెటిస్ రోగులు దీనికి దూరంగా ఉండాలి.
100 గ్రాముల ద్రాక్షలో 16 గ్రాముల చక్కెర లభిస్తుంది. కాబట్టి దీనికి దూరంగా ఉండాలని వైద్యులు చెబుతున్నారు.
డయాబెటిస్ రోగులు పైనాపిల్ తినకూడదు. ఎందుకంటే ఇందులో 16 గ్రాముల వరకు చక్కెర ఉంటుంది.
తియ్యటి పండ్లలో చెర్రీ కూడా వస్తుంది. ఇందులో 8 గ్రాముల వరకు చక్కెర ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
వంద గ్రాముల ఖర్జూరంలో 63 గ్రాముల చక్కెర ఉంటుంది. డయాబెటిక్ పెషెంట్ అయితే పొరపాటున కూడా ఈ పండును తినకండి. షుగర్ లెవల్స్ పెరిగే అవకాశం ఉంటుంది.
లిచీ తియ్యగా ఉంటుంది. ఇందులో 16 గ్రాముల వరకు చక్కెర ఉంటుంది. కాబట్టి డయాబెటిక్ రోగులు ఈ పండును తినకూడదు.
వేసవిలో డిమాండ్ ఉన్న పండ్లలో మామిడి పండు ఒకటి. దీని తీసుకోవడం వల్ల బోలెడు ఆరోగ్య లాభాలు ఉన్నప్పటికి డయాబెటిస్ రోగులకు మామిడి తినడం మానుకోవాలని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.