Devara: ప్యాన్ ఇండియా హీరోల్లో ఎన్టీఆర్ సంచలనం.. RRR తర్వాత దేవర కోసం మరోసారి ఆ పని చేసిన తారక్..

Devara: ప్యాన్ ఇండియా హీరోల్లో ఎన్టీఆర్ సంచలనం.. ఆర్ఆర్ఆర్ తర్వాత దేవర కోసం ఆ పని చేసి మరోసారి వార్తల్లో నిలిచారు. అవును ఈ మధ్యకాలంలో రిలీజ్ అవుతున్న ప్యాన్ ఇండియా చిత్రాల్లో ఏ హీరో తన పాత్రకు తాను డబ్బింగ్ చెప్పుకోవడం లేదు. కానీ ఎన్టీఆర్ మాత్రం ‘ఆర్ఆర్ఆర్’ కోసం వివిధ భాషల్లో తన క్యారెక్టర్ కు తానే డబ్బింగ్ చెప్పాడు. ఇపుడు ‘దేవర’ కోసం అదే పని చేసాడు.

1 /6

‘దేవర’ సినిమా కోసం ఎన్టీఆర్ మలయాళం తప్పించి తెలుగు, హిందీ, కన్నడ, తమిళ భాషల్లో తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకున్నాడు. సైఫ్ అలీ ఖాన్ పాత్రకు రవిశంకర్ డబ్బింగ్ చెప్పారు. ఆర్ఆర్ఆర్ సినిమా కోసం మలయాళ భాష తప్పించి మిగిలిన భాషల్లో తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకోవడం విశేషం.

2 /6

‘దేవర’ కథను సినిమాగా  తెరకెక్కిస్తే 9 గంటల నిడివి  ఉండే అవకాశం ఉందట. అందుకే ఈ చిత్రాన్ని రెండు పార్టులుగా కొరటాల శివ తెరకెక్కిస్తున్నాడు. 

3 /6

క్లైమాక్స్ లో వచ్చే లాస్ట్ 40 నిమిషాలు.. అండర్ వాటర్ సీక్వెన్స్ సినిమాకే హైలెట్ గా ఉండనుంది. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు.

4 /6

200 గజాల్లో సముద్రపు సెట్ ను వేయడం వేశారట. అందులో 5 వారాల పాటు షూట్ చేసారట. అంతేకాదు కృత్రిమ అలలు క్రియేట్ చేసారట. 

5 /6

వాటర్ సీక్వెన్స్ కు వాడే పడవలను ఆర్ట్ డైరెక్టర్ సాబు సిరిల్ సెపరేట్ గా డిజైన్ చేసినట్టు సమాచారం. 90 కాలం నాటి పరిస్థితులకు తగ్గట్టు తీర్చిదిద్దారట.

6 /6

రియల్ వాటర్ లో కూడా ఆ పడవలతో ప్రయాణం చేయోచ్చట. ‘దేవర’ సినిమాలో నైట్ ఎఫెక్ట్స్ కోసం తక్కువ వెలుతురులో షాట్స్ ను తీసినట్టు సమాచారం.