Hyderabd Houses: హైదరాబాద్ లో సొంత ఇల్లును కొనాలంటే మామూలు మాటలు కాదు. కోట్లు ఖర్చు చేయలేనిది ఇల్లు కొనలేని పరిస్థితి. నగరంలో అపార్ట్ మెంట్లు, ఇండిపెండెంట్ ఇళ్లు, విల్లాల ధరలు కోట్లరూపాయలు పలుకుతున్నాయి. సామాన్యులు ఇల్లు కొనాలంటే ధరలను చూస్తేనే గుండె గుబేల్ మంటోంది. అయినా కూడా హైదరాబాద్ లోని ఈ ఏరియాలో మాత్రం ఇళ్లు చాలా తక్కువ ధరకే అందుబాటులో ఉన్నాయి.ఇక్కడ మీరు అపార్ట్ మెంట్ లో ఫ్లాట్ కొనుగోలు చేసే ధరకే ఇండిపెండెంట్ హౌస్ ను కొనుగోలు చేయోచ్చు. ఎక్కడో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
Hyderabd Houses: హైదరాబాద్ నగరంలో ఎక్కువగా పశ్చిమ ప్రాంతంలో డెవలప్ మెంట్ జరిగింది. ముఖ్యంగా ఐటీ కారిడార్ తోపాటు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వంటి బాగా డెవలప్ అయిన ప్రాంతాల్లో గచ్చిబౌలి, కోకాపేట్, మణికొండ, శంకర్ పల్లి వంటి ప్రాంతాలు ఉన్నాయి.
ఇల్లు కొనాలంటే కోట్లలోనే ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ ప్రాంతంలో అపార్ట్ మెంట్లో ఒక ఫ్లాటు ఖరీదు కూడా కోటిరూపాయలపైనే ఉంటుంది.
పశ్చిమ ప్రాంతంలోనే కాదు హైదరాబాద్ నలుమూలలా ధరలు భారీగా పెరిగిపోయాయి. కోట్లు ఖర్చు చేయలేనిది స్థలం కొనలేని పరిస్థితి. అయితే నగరంలోని కోర్ ప్రాంతాల్లో ఇండిపెండెంట్ ఇళ్లు, అపార్ట్ మెంట్లు వంటి కొత్త ప్రాజెక్టులు నిర్మించేందుకు కూడా స్థలం లేదు. ఈ ప్రాంతంలో మీరు రీసెల్ ఆఫర్ ఉన్న ఇంటిని మాత్రమే కొనాల్సి ఉంటుంది. రీసెల్ ప్రాపర్టీకి కూడా కోట్లాది రూపాయలు ఖర్చు చేయాల్సిందే.
అయినా కూడా మీరు తక్కువ ధరకే ఇంటిని కొనుగోలు చేయాలంటే నగరంలో ఈ ఏరియాలో ఇల్లు కొనుగోలు చేసేందుకు అనూకూలంగా ఉందని చెప్పవచ్చు. ఎక్కడో చూద్దాం.
హైదరాబాద్ నగరానికి 25కిలోమీటర్ల దూరంలో ఔటర్ రింగ్ రోడ్డు ప్రాంతం ఉంది. ఇక్కడ ఇల్ల ధరలు చాలా తక్కువగా ఉన్నాయి. అదే విధంగా షామిర్ పేట్, వరంగల్ హైవే, విజయవాడ హైవే ప్రాంతాల్లో ఇండిపెండెంట్ ఇళ్ల ధరలు చాలా తక్కువ ధరకే ఉన్నాయి. ఇక్కడ మీరు కోటి రూపాయలు వెచ్చిస్తే మంచి ఇండిపెండెంట్ ఇల్లును కొనుగోలు చేయవచ్చు.
ముఖ్యంగా శామీర్ పేట ప్రాంతానికి ఇప్పుడు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. ఎందుకంటే ఔటర్ రింగ్ రోడ్డుకు ఆనుకోని ఉండటం వరంగల్, కరీంనగర్ హైవే కావడంతో అక్కడ భూములకు రెక్కలు వచ్చాయి.
అంతేకాదు రిసార్టులు, ఫాంహౌజులు, ప్రశాంతత కోరుకునేవారికి అనువైన ప్రాంతం. శామీర్ పేట నుంచి హైదరాబాద్ కు రావాలంటే కేవలం 20 నిమిషాల సమయం కూడా పట్టదు.
అంతేకాదు రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్, మున్సిపాలిటీ ఆఫీసులు అక్కడే ఉండటం..ప్రశాంతమైన వాతావరణంతోపాటు ఇంటర్నెషనల్ స్కూల్స్ కూడా ఉండటంతో ఇప్పుడు చాలా మంది అక్కడ ఇల్లు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అపార్ట్ మెంట్లలో త్రిబుల్ బెడ్రూం ఫ్లాట్లు 30 నుంచి 40లక్షల వరకు ఉన్నాయి. 1200 గంజాల ఇండిపెండెంట్ హౌజ్ 50 లక్షల నుంచి అందుబాటులో ఉన్నాయి. తక్కువ ధరలోనే ఇండిపెండెంట్ ఇల్లు కొనాలనుకునేవారికి ఇది మంచి ఛాయిస్ అని చెప్పవచ్చు.
ఈ కథనం కేవలం సమాచారం కోసం మాత్రమే. పెట్టుబడి కానీ వ్యాపార సలహాగా భావించరాదు. మీరు చేసే బిజినెస్ లు, పెట్టుబడులపై మీరు పొందే లాభనష్టాలకు జీతెలుగు న్యూస్ కు ఎలాంటి బాధ్యత లేదు. మీరు ఆర్థిక నిర్ణయాలు తీసుకునే ముందు మీ ఆర్థిక సలహాదారులను సంప్రదించిన తర్వాత నిర్ణయాలు తీసుకోవాలని సలహా మాత్రమే ఇస్తుంది.