Dating Tips: మొదటిసారి డేటింగ్ వెళ్తున్నారా, అయితే ఈ ప్రశ్నలు తప్పకుండా అడగాల్సిందే

యవతీ యువకులకు బాగా తెలిసిన పదం డేటింగ్. మొదటి సారి డేటింగ్ వెళ్తున్నప్పుడు కచ్చితంగా అది చాలా ప్రత్యేకమౌతుంది. అయితే మొదటి సారి డేటింగ్ వెళ్తున్నప్పుడు కొన్ని సూచనలు లేదా జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలంటున్నారు నిపుణులు. అప్పుడే మీ బంధం కలకాలం నిలబడగలదు. 

Dating Tips: యవతీ యువకులకు బాగా తెలిసిన పదం డేటింగ్. మొదటి సారి డేటింగ్ వెళ్తున్నప్పుడు కచ్చితంగా అది చాలా ప్రత్యేకమౌతుంది. అయితే మొదటి సారి డేటింగ్ వెళ్తున్నప్పుడు కొన్ని సూచనలు లేదా జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలంటున్నారు నిపుణులు. అప్పుడే మీ బంధం కలకాలం నిలబడగలదు. 

1 /7

ఫస్ట్ డేట్ మొదటి సారి డేటింగ్ వెళ్తున్నప్పుడు చాలా ఉత్సాహంగా ఉంటారు. అన్నివిధాలుగా సంసిద్ధమౌతారు. డేట్ ప్లేస్ ఫిక్స్ చేయడం, బట్టలు సిద్ధం చేయడం, మేకప్ ఇలా చాలానే ఉంటాయి. ఎందుకంటే మొదటి డేటింగ్ అనేది మీ బంధానికి పునాది కాగలదు.

2 /7

కొన్ని ప్రశ్నలు మొదటి సారి డేటింగ్ సమయంలో కొన్ని విషయాలపై ప్రత్యేక దృష్టి అవసరం. ఎందుకంటే మొదట్లోనే వాటిపై క్లారిటీ వస్తే భవిష్యత్తులో ఇబ్బంది తలెత్తదు.

3 /7

భాగస్వామి కల్చర్  ఫస్ట్ డేట్ అనేది చాలా ముఖ్యమైంది. ఎందుకంటే ప్రతి చిన్న విషయంపై ఇద్దరి దృష్టి ఉంటుంది. మీ పార్టనర్ వ్యవహార శైలి పరిశీలించి తెలుసుకునే ప్రయత్నం తప్పకుండా చేయాలి. అతని ద్వారా అతని కుటుంబం గురించి తెలుసుకోవాలి

4 /7

కుటుంబం మహత్యం ఫస్ట్ డేట్ సమయంలో మీ గురించి చెప్పుకోవడంతో పాటు మీ పార్టనర్ కుటుంబం గురించి తప్పకుండా అడిగి తెలుసుకోవాలి. మీ బంధాన్ని ముందుకు తీసుకెళ్లాలనుకుంటే ఇది అవసరం. అందుకే కుటుంబం గురించి మీ పార్టనర్ అభిప్రాయమేంటనేది మొదట్లోనే తెలుసుకోవాలి.

5 /7

కెరీర్ గురించి ప్రశ్నలు మీ పార్టనర్‌తో మొదటి సారి డేటింగ్‌లో ఉన్నప్పుడు కెరీర్ గురించి తప్పకుండా అడిగి తెలుసుకోవాలి. అతనికిష్టమైన ఉద్యోగం, కెరీర్ గురించి స్పష్టంగా మాట్లాడుకోవాలి.

6 /7

కట్టుబాట్లు, రాజీ పడటం ఎవరికైనా సరే వారి సిద్ధాంతం అంటే కట్టుబాట్లు చాలా ముఖ్యమైనవి. అందుకే మొదటి సారి డేటింగ్‌లో పార్టనర్ వైఖరి, కట్టుబాట్ల గురించి తప్పకుండా అడిగి తెలుసుకోవాలి. తను నమ్మిన సిద్ధాంతాల కోసం రాజీ పడుతున్నారా లేదా అనేది తెలుసుకోవాలి

7 /7

గత అనుభవం మొదటిసారి డేటింగ్‌లో ఉన్నప్పుడు  మీ పార్టనర్ గత సంబంధాల గురించి స్పష్టంగా అడిగి తెలుసుకోవాలి. అప్పుడే ఎమోషనల్ ఇబ్బందులుండవు