CTET Answer Key 2024 Released: సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యూకేషన్ (CBSE) ప్రొవిజనల్ ఆన్సర్ కీ విడుదల చేసింది. సెంట్రల్ టీచర ఎలిజిబిలిటీ టెస్ట్ (CTET) డిసెంబర్ 2024 సంబంధించిన ఆన్సర్ కీ విడుదల చేసింది. ఈ లింక్ ద్వారా అభ్యర్థులు వెంటనే కీ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
పేపర్ 1, 2కు సంబంధించిన ఆన్సర్ కీ అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ctet.nic.in ద్వారా మీ క్రమ సంఖ్య, పుట్టిన తేదీ నమోదు చేసి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సీటెట్ ఆన్సర్ కీ ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి తెలుసుకుందాం.
ముందుగా ctet.nic.in అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేయాలి. ఆ తర్వాత హోంపేజీలోని సీటెట్ ఆన్సర్ కీ డౌన్‌లోడ్ లింక్‌పై క్లిక్ చేయాలి.
ఆ తర్వాత లాగిన్ వివరాలు నమోదు చేయాలి. అక్కడ మీరు క్రమ సంఖ్య, పుట్టిన తేదీ ఇతర వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత సీటెట్ ఆన్సర్ కీ చెక్ చేసుకోవచ్చు.
2024 డిసెంబర్ 14, 15 తేదీల్లో సీటెట్ పరీక్ష దేశవ్యాప్తంగా వివిధ సెంటర్లలో నిర్వహించారు. అభ్యర్థులకు ఏమైనా అభ్యంతరాలు వ్యాలిడ్ అనిపిస్తే ఫీజు రీఫండ్ చేస్తారు పాలసీ డిసిషన్ సీబీఎస్‌ఈ తీసుకుంటుంది.
ఈ పరీక్ష 150 మార్కులకు నిర్వహించారు. ప్రతి ఒక్క ప్రశ్నకు ఒక్క మార్కు మీరు ఒకవేళ 70 ప్రశ్నకు జవాబు కరెక్ట్ రాస్తే 70 మార్కులు లభిస్తాయి. ఇందులో నెగిటివ్ మార్కులు లేవు.