Chiranjeevi: హనుమాన్ వేషంలో చిరంజీవి.. భక్తిలో ఫ్యాన్స్..

Chiranjeevi as Hanuman: చిరంజీవి.. రామ భక్త హనుమాన్ భక్తుడన్న సంగతి ఎవరు అడిగినా చెబుతారు. శివ శంకర వరప్రసాద్ కాస్త చిరంజీవిగా మారడం వెనక హనుమంతుడి ఆశీర్వాదాలే ఉన్నాయని చిరు పలు ఇంటర్వ్యూల్లో ప్రస్తావించారు. ఇక ఆయన ఇష్టదైవం కూడా హనుమంతుడే. ఇక తన ఇష్టదైవమైన హనుమంతుడి వేషాన్ని ఓ సినిమాలో వేసారు. అంతేకాదు త్వరలో మరో సినిమాలో ఆ వేషం వేయబోతున్నారు. 

1 /7

Megastar chiranjeevi as Hanuman: అవును మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీని  రామ భక్త్ హనుమంతుడిని విడదీసి చూడలేము. మెగా ఫ్యామిలీలో ముందుగా శివ శంకర్ వరప్రసాద్ కాస్త చిరంజీవిగా మారారు. ఇక తమ్ముడు కళ్యాణ్ బాబు కూడా తన పేరు ముందు హనుమంతుడి పేరైన పవన్ పేరును చేర్చుకొని పవన్ కళ్యాణ్ అయ్యారు.అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ తిరుగులేని హీరో అవ్వడంలో హనుమాన్ పేరు కలిసొచ్చింది.

2 /7

ఇక చిరంజీవి తన కుమారుడికి కూడా రామ్ చరణ్ అంటూ ఆ రాముడి చరణాలను కొలిచే హనుమంతుడి పేరు పెట్టారు చిరు. ఇక చిరంజీవి తల్లిగారి పేరు హనుమాన్ తల్లి పేరు అయినా అంజనా దేవిగా ఉండటం యాదృచ్ఛికంగా కలిసొచ్చిన అంశమనే చెప్పాలి.

3 /7

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఇంతటి హనుమాన్ భక్తులైన కుటుంబం ఇంకొకటి లేదేమో. ఆ సంగతి పక్కన పెడితే.. హనుమాన్ సినిమా దర్శకుడు ప్రశాంత్ వర్మ.. త్వరలో తాను తెరకెక్కించబోయే 'జై హనుమాన్' సినిమాలో మెగాస్టార్ చిరంజీవి.. హనుమాన్ వేషం వేయించాలని చూస్తున్నారు. దాన్ని పోషించే నటుడిని చూస్తే భక్తి భావం పొంగిపొర్లాలి. నిజ జీవితంలో కూడా భక్తి భావం ఉండాలి.  

4 /7

చిరంజీవి హనుమంతుడి పాత్ర పోషిస్తే బాగుంటుందని చెప్పారు. ఆన్ స్క్రీన్‌తో పాటు ఆఫ్ స్క్రీన్‌లో కూడా వారి ఇమేజ్ సరితూగాలి. అందుకు చిరంజీవి పర్ఫెక్ట్ ఛాయిస్ అన్నారు. గతంలో చిరంజీవి .. జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమాలో ఓ సన్నివేశంలో హనుమంతుడి వేషంలో కాసేపు అలా కనిపించారు. అందులో హనుమాన్ పాత్రతో ఓ ఫైట్ కూడా ఉంటుంది. అటు ఈ సినిమాలో జై చిరంజీవా అంటూ హనుమంతుడిని కీర్తిస్తూ ఓ పాట కూడా వుంది. అటు జై చిరంజీవా అంటూ చిరు ఓ సినిమా కూడా చేసారు.

5 /7

అటు కొండవీటి దొంగ సినిమాలో శ్రీ ఆంజనేయం.. ప్రసన్నాంజనేయం అంటూ ఓ సాంగ్ కూడా ఉంది. ఈ రకంగా సినిమాల్లో సందర్భం వచ్చినపుడల్లా హనుమంతుడిపై తన భక్తి భావం చూపిస్తూనే వస్తున్నారు మెగాస్టార్. ఇపుడు ప్రశాంత్ వర్మ సినిమాకు చిరు ఓకే చెప్పినట్టు సమాచారం. మోక్షజ్ఞ సినిమా తర్వాత చిరుతో ‘హానుమాన్’ సినిమా తెరకెక్కే అవకాశాలున్నాయి. ఒకవేళ చిరు ఈ సినిమాలో నటిస్తే..  పూర్తి స్థాయిలో హనుమాన్ వేషంలో మెగాస్టార్ చిరంజీవి యాక్ట్ చేసిన సినిమాగా ఇది నిలవబోతుంది. 

6 /7

ప్రస్తుతం చిరంజీవి.. విశ్వంభర సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో చిరు సరసన త్రిష, మీనాక్షి చౌదరి, ఆషికా రంగనాథ్ కథానాయికగా నటిస్తున్నారు.  ఈ సినిమా వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు.  

7 /7

అటు హరీష్ శంకర్ దర్శకత్వంలో కూతురు నిర్మాణంలో ఓ సినిమా త్వరలో సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందనే మాట వినపడింది. ‘మిస్టర్ బచ్చన్’ రిజల్ట్ తర్వాత చిరు తన నిర్ణయం మార్చుకుంటారా అనేది చూడాలి. రీసెంట్ గా హరీష్ డైరెక్షన్ లోనే ‘కంట్రీ డిలైట్’ కమర్షియల్ యాడ్ చేశారు.  అటు చిరు.. ప్రశాంత్ వర్మ.. 'జై హనుమాన్' సినిమాకు సంబంధించిన అఫిషియల్ ప్రకటన వెలుబడాల్సి ఉంది.