Chiranjeevi Padma Vibhushan: తాజాగా దిల్లీలో జరిగిన పద్మ అవార్డుల ప్రధానోత్సవం కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతులు మీదుగా మెగాస్టార్ చిరంజీవి.. దేశ రెండో అత్యున్న పౌరపురస్కరమైన పద్మవిభూషణ్‌ను అందుకున్నారు. ఈ సందర్బంగా హైదరాబాద్‌లో విలేఖరులతో మాట్లాడారు.
దిల్లీలో జరిగిన పద్మ అవార్డుల్లో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా సహా పలువురు పాల్గొన్నారు.
2006లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ హయాంలో పద్మ భూషణ్ అవార్డు అందుకున్న చిరంజీవి.. తాజాగా బీజేపీ నేతృత్వంలోని ఎన్టీయే ప్రభుత్వంలో పద్మవిభూషణ్ అందుకున్నారు.
ఈ అవార్డు కార్యక్రమానికి చిరంజీవి తన కుటుంబ సభ్యులతో కలిసి దిల్లీ వెళ్లారు. అక్కడ పలువురు కేంద్ర మంత్రులను మర్యాద పూర్వకంగా కలిసారు.
ఈ కార్యక్రమం అనంతరం చిరంజీవి ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయంలో హైదరాబాద్ చేరుకున్నారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. పద్మ విభూషణ్ అవార్డు రావడంపై సంతోషం వ్యక్తం చేసారు.
ఈ అవార్డు నాతో పనిచేసిన దర్శకులు..నిర్మాతలు.. నటీనటులకు, సాంకేతిక నిపుణుల కారణంగా తనకు ఈ అవార్డు వచ్చింన్నారు.
అలాగే ఫ్యాన్స్ అండదండలు ఎపుడు మరిచిపోలేను. అందరీ పేరు పేరునా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసారు.
ప్రస్తుతం దేశ వ్యాప్తంగానే కాదు.. ఏపీలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలపై మాట్లాడారు. నేను ప్రస్తుతం ఏ పార్టీలో లేను. పిఠాపురం నుంచి పోటీ చేస్తోన్న నా తమ్ముడు పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో గెలవాలని కోరుకుంటున్నాను.
పిఠాపురంలో ఎన్నికల ప్రచారానికి నేను వెళ్లడం లేదు. నన్ను రమ్మని ఆయన ఫోర్స్ చేయలేదు. అలాగే సీనియర్ ఎన్టీఆర్‌కు భారతరత్న వస్తే సంతోషంగా ఉంటుంది. ప్రభుత్వ సహకారంతో త్వరలో అది సాకారం అవుతుందనే నమ్మకం తమకు ఉందన్నారు.