Weather Update: రెండు రోజులుగా చిరుజల్లులు.. 21 మి మీటర్ల వర్షపాతం, నేటి నుంచి మార్పు..

Telangana Weather Update: రాష్ట్రంలో గత రెండు రోజులుగా చిరుజల్లులు కురుస్తూనే ఉన్నాయి. పగటిపూట చలిగాలులు కూడా విపరీతంగా పెరిగాయి... రాత్రిపూట ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. అంతేకాదు ముసురు కూడా వేయడంతో తీవ్రత పొగ మంచు బాగా పేరుకుంది. అయితే నేటి నుంచి వాతావరణం లో మార్పు ఉండవచ్చు అని వాతావరణ శాఖ తెలిపింది.
 

1 /5

రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు తెలంగాణ వ్యాప్తంగా తడిసి ముద్దయింది. ముఖ్యంగా రాష్ట్ర హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్ జిల్లాలో చిరుజల్లులు కురిసాయి.. కానీ రోజంతా ఇదే పరిస్థితి ఉంది.  

2 /5

అంతేకాదు చలి తీవ్రత కూడా పెరిగిపోయింది. ముఖ్యంగా మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ గాయత్రి నగర్ లో 21 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది.  

3 /5

ఇది కాకుండా హైదరాబాద్‌లోని షేక్ పేటలో 6, ఓయూలో 5, హిమాయత్ నగర్ లో 6, ఫిలింనగర్ 5, ఉప్పల్ 5, ఆసిఫ్ నగర్ లో 5, అంబర్‌పేటలో 5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.  

4 /5

అయితే నేటి నుంచి వాతావరణంలో మార్పులు ఉండవచ్చు. ఇలా చిరుజల్లులు కురవక పోవచ్చు. అని భారత వాతావరణ శాఖ తెలిపింది. కానీ ఉదయం నుంచి కూడా ముసిరేసింది చలిగాలిల తీవ్రత పెరిగింది.  

5 /5

మారుతూ ఉన్న వాతావరణం దృష్ట్యా సీజనల్ వ్యాధులు కూడా పెరుగుతున్నాయి. ఇప్పటికే వాహనదారులు, వృద్ధులు, పిల్లలకు జాగ్రత్తలు తీసుకోవాలని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది.. సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి ఆసుపత్రికి క్యూ కూడా కడుతున్నారు.