Budget 2024: ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్.. జీతంలో 50 శాతం వరకు పెన్షన్‌కు ఛాన్స్..!

Budget 2024: ఓల్డ్‌ పెన్షన్‌ స్కీమ్‌ (OPS) పునరుద్ధరించాలి అని ఎప్పటి నుంచో కేంద్ర ప్రభుత్వ ఉద్యుగులు కోరుతున్న సంగతి తెలిసిందే. అయితే, దీన్ని పునరుద్ధరించలేం కానీ కొన్ని మార్పులు చేసి పదవీ విరమణ పొందిన చివరి నెలలో ఎంత జీతం పొందుతారో దానికి సగం జీవితకాలం పెన్షన్‌గా హామీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
 

1 /5

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఈ నెల బడ్జెట్‌ ప్రవేశపెట్టడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఓ తాజా కబురు అందింది. ఈ ఓల్డ్‌ పెన్షన్‌ పథకంలో రిటైర్మెంట్‌ తర్వాత చివరి నెలలో డ్రా చేసిన శాలరీలో 50 శాతం పెన్షన్‌ అందించనున్నట్లు హామీ ఇవ్వనున్నారు  

2 /5

ఈ పెన్షన్‌ వారి జీవితకాలంలో ప్రతినెలా పొందుతారు. ముఖ్యంగా కనీసం పది ఏళ్లుపని చేసి రిటైర్మెంట్‌ అయినా ఇదే విధంగా ఉంటుంది. జీతంలో ఏ కట్టింగ్స్‌ ఉండవు. అయితే, ఎన్‌పీఎస్‌ అంటే నేషనల్‌ పెన్షన్‌ స్కీమ్‌లో బేసిక్‌ పేలో ఉద్యోగులు 10 శాతం, కేంద్రం 14 శాతం కంట్రీబ్యూట్‌ చేస్తుంది. ఈ విధానంలో 50 శాతం పెన్షన్‌ వస్తుందో లేదో అనే ఆందోళన ఉద్యోగుల్లో ఉంది.  

3 /5

దీనిపై ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్‌, ఆర్థిక కార్యదర్శి సోమనాథన్‌ నేతృత్వంలో ఓ కమిటీని ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్‌ వంటి రాష్ట్రాలు అవలంభిస్తున్న విధానాన్ని పరిశీలించింది. ఈ కమిటీ ఆధారంగా పాత పెన్షన్‌ స్కీమ్‌ను పునరుద్ధరించే అవకాశం లేదు కానీ, ప్రస్తుతం ఉన్న విధానంలో కొంత భాగం మాత్రం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ బడ్జెట్‌లో హామీగా ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.  

4 /5

ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఎన్‌పీఎస్‌లో కాస్త మార్పులు చేయనున్నట్లు యోచిస్తోంది. ఓపీఎస్‌, ఎన్‌పీఎస్‌ మధ్య తేడాకు ఉద్యోగుల ఆందోళనను పరిక్షరించే దిశగ కేంద్రం ఈ చర్యలు చేపట్టింది. ఉద్యోగుల చివరినెల శాలరీలో సగభాగం పెన్షన్‌గా పొందేలా హామీ ఇస్తున్నారు.   

5 /5

ఈ కొత్త పెన్షన్‌ స్కీమ్‌లో కేవలం ఉద్యోగుల కంట్రీబ్యూషన్‌పై ఆధారపడి ఉండేది. కొన్ని కారణాల వల్ల ముందుగా రిటైర్‌ అయినవారికి చాలా తక్కువ మొత్తంలో పెన్షన్‌ లభిస్తుందనే విమర్శలు కూడా ఉన్నాయి.