BSNL superhit plan: బీఎస్‌ఎన్‌ఎల్‌ సూపర్‌ హిట్‌ ప్లాన్‌ 35 రోజుల వ్యాలిడిటీ కేవలం రూ. 107.. మరిన్ని ప్రయోజనాలు తెలుసుకోండి..

BSNL superhit plan: టెలికాం కంపెనీలు ఒకేసారి రీఛార్జీ ధరలను భారీగా పెంచేశాయి. ఈ సందర్భంగా చాలామంది మొబైల్‌ వినియోగదారులు ఈ భారాన్ని ఎలా తగ్గించుకోవాలో ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు ఇతర కంపెనీలకు పోర్ట్‌ అవ్వడానికి ప్లాన్‌ చేస్తున్నారు.
 

1 /5

 ప్రస్తతం మార్కెట్లో ఏ టెలికాం రీఛార్జీ ధరలు తమకు అందుబాటులో ఉన్నాయో వెతుకుతున్నారు. ఈరోజు అలాంటి సూపర్‌ హిట్‌ ప్లాన్‌ మీ ముందుకు తీసుకువచ్చాం.   

2 /5

మీరు బీఎస్‌ఎన్‌ఎల్‌ సిమ్‌ వినియోగదారులు అయితే, ఈ వార్త మీకు గుడ్‌ న్యూస్‌. అతి తక్కువ ధరలోనే రీఛార్జీ ప్లాన్స్‌ అందుబాటులో ఉన్నాయి. భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌ రూ. 107 ప్రీపెయిడ్‌ రీఛార్జీ ప్లాన్‌ అందుబాటులోకి తీసుకువచ్చింది.   

3 /5

ఇది ఇతర కంపెనీల కంటే చాలా తక్కువ ధరలో అందుబాటులో ఉంది. మీరు తక్కవ ధరలోనే రీఛార్జీ ప్లాన్స్‌ కోసం ఎదురు చూస్తున్నట్లయితే, ఎయిర్‌టెల్‌, జియో, వోడాఫోన్‌ ఐడియా కంటే ఇది బెస్ట్ రీఛార్జీ ప్లాన్‌.  

4 /5

బీఎస్‌ఎన్‌ఎల్‌ 35 డేస్ ప్లాన్‌ బెనిఫిట్స్‌.. బీఎస్‌ఎన్‌ల్‌ 35 రోజుల ప్లాన్‌ తో వినియోగదారులకు 3 జీబీ డేటా కూడా అందిస్తుంది. ఇంటర్నెట్‌ స్పీడ్‌ 40kbps, వినియోగదారులు 200 నిమిషాల ఫ్రీ వాయిస్‌ కాల్స్‌ కూడా అందుకుంటారు. ఇది ప్రస్తుతం ఉన్న మార్కెట్లో అతి తక్కువ ధరలో అందుబాటులో ఉన్న ప్లాన్‌.

5 /5

 అంతేకాదు ఈ ప్లాన్ 35 రోజులకు ప్లాన్‌ వర్తిస్తుంది. బీఎస్‌ఎన్‌ఎల్‌ ట్యూన్స్‌ ఫెసిలిటీ కూడా పొందవచ్చు. తక్కువ ధరలో రెండో సిమ్‌ కూడా ఉండాలి అనుకునేవారికి ఇది బెస్ట్‌ ఆప్షన్‌. డొమెస్టిక్‌ కాల్స్‌కు రూ. 107 ప్లాన బెస్ట్‌