8th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్, DA, TA, HRA భారీగా పెంపు

8th Pay Commission Latest Updates: 8వ వేతన సంఘం నోటిఫికేషన్‌ ప్రకటన బడ్జెట్‌లో ఉండవచ్చని అంచనా ఉంది. ఎందుకంటే 8వ వేతనసంఘం కోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు.
 

8th Pay Commission Latest News: 8వ వేతన సంఘం అమలు తర్వాత ఉద్యోగుల వేతనాల్లో భారీ పెంపుదల ఉంటుంది. ఇది అమల్లోకి వస్తే ఉద్యోగుల వేతన విధానంలో అనేక మార్పులు రానున్నాయి. 8వ వేతన సంఘంలో ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను 2.57 నుంచి 3.68కి పెంచాలనేది ప్రధాన డిమాండ్. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ అనేది ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పెన్షన్‌లను లెక్కించడానికి ఉపయోగించే సాధారణ గణాంకం. 8వ వేతన సంఘం కింద డియర్‌నెస్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్స్, ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్  వంటివాటిలో మార్పులు తీసుకురావాలని భావిస్తున్నారు.

1 /8

8వ వేతన సంఘం ఏర్పాటు చేసి అమలు చేస్తే దాదాపు 67.85 లక్షల మంది పెన్షనర్లు, 48.62 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు లబ్ధి పొందుతారు.

2 /8

8వ వేతన సంఘం ఏర్పాటుకు సంబంధించిన ప్రభుత్వం ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. 8వ వేతన సంఘం అమలు చేసే ఉద్దేశం ఇప్పుడప్పుడే లేదని గత ఏడాది ఆర్థిక శాఖ కార్యదర్శి వెల్లడించారు. ఆ తర్వాత ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారం రాలేదు. అయితే బడ్జెట్‌లో దీనికి సంబంధించిన ప్రకటన వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

3 /8

8వ వేతన సంఘం డియర్‌నెస్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్స్, ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్ (టిఎ) వంటి వివిధ ప్రయోజనాలలో మార్పులు తీసుకురావాలని భావిస్తున్నారు. 

4 /8

ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను 3.68కి పెంచుతూ 8వ వేతన సంఘం అమల్లోకి వస్తే 18 స్థాయిల్లోని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతన విధానంలో గణనీయమైన పెంపు ఉంటుందని భావిస్తున్నారు. ఉదాహరణకు, పే మ్యాట్రిక్స్ లెవల్ 1 ఉద్యోగుల ప్రాథమిక జీతం 7వ వేతన సంఘంలో 18 వేల నుంచి 21 వేలకు పెరగవచ్చు. గరిష్ట వేతనంగా లెవల్ 18లోని ఉద్యోగులకు 2 లక్షల 50 వేల నుంచి 3 లక్షలకు పెరగవచ్చు.

5 /8

6వ వేతన సంఘంలో 1.86 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ సిఫార్సు చేయగా, 7వ వేతన సంఘంలో సాధారణ ఫిట్‌మెంట్ 2.57గా సిఫార్సు చేసింది. ఈ ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఆధారంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కనీస మూల వేతనం నెలకు 18 వేలుగా నిర్ణయించారు. అంతకుముందు ఇది 7 వేలుంది. ప్రస్తుతం ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను 2.57 నుంచి 3.68కి పెంచాలని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.

6 /8

8వ వేతన సంఘంలో ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను 2.57 నుంచి 3.68కి పెంచాలని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ అనేది ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పెన్షన్‌లను లెక్కించడానికి ఉపయోగించే సాధారణ గుణకం. 

7 /8

ఇప్పుడు ఒకవేళ 8వ వేతన సంఘం నోటిఫికేషన్ వెలువడితే, అది 2026లో అమల్లోకి వస్తుంది. ఎందుకంటే ఏ వేతన సంఘం అమలు చేయాలన్నా 1 1/2 నుండి 2 సంవత్సరాలు పడుతుంది. అందువల్ల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, అలవెన్సులు,పెన్షన్ ప్రయోజనాలను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం 8వ వేతన సంఘాన్ని త్వరలో ఏర్పాటు చేయాల్సి ఉంది.

8 /8

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు,పెన్షన్‌లను సవరించడానికి, కేంద్ర ప్రభుత్వం జనవరి 1, 2026 నుండి 8వ వేతన సంఘం సిఫార్సులను పెద్ద ఎత్తున అమలు చేయాలని భావిస్తున్నారు. సాధారణంగా, రెండు పే కమీషన్ల మధ్య దాదాపు 10 సంవత్సరాల గ్యాప్ ఉంటుంది. 7వ వేతన సంఘం పదేళ్ల పదవీకాలం డిసెంబర్ 31, 2025తో ముగియడంతో, తదుపరి వేతన సంఘం నోటిఫికేషన్ కోసం ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.