BSNL ఈ రీఛార్జ్ ప్లాన్‌తో మీకు Double Data, అన్‌లిమిటెడ్ కాల్స్ సహా మరెన్నో ప్రయోజనాలు

 ప్రభుత్వ రంగ టెలికాం దిగ్గజం భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్(BSNL) ప్రైవేట్ టెలికాం కంపెనీలకు ధీటుగా ముందుకు సాగుతోంది. వరుస ఆఫర్లు, ప్రత్యేకమైన రీఛార్జ్ ప్లాన్లతో ఎయిర్‌టెల్, రిలయన్స్ జియో, వోడాఫోన్ ఐడియా(Vi) టెలికాం కంపెనీలకు పోటీ ఇస్తోంది. తాజాగా తన వినియోగదారులకు బీఎస్ఎన్ఎల్ శుభవార్త అందించింది.

BSNL Offering Double Data : ప్రభుత్వ రంగ టెలికాం దిగ్గజం భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్(BSNL) ప్రైవేట్ టెలికాం కంపెనీలకు ధీటుగా ముందుకు సాగుతోంది. వరుస ఆఫర్లు, ప్రత్యేకమైన రీఛార్జ్ ప్లాన్లతో ఎయిర్‌టెల్, రిలయన్స్ జియో, వోడాఫోన్ ఐడియా(Vi) టెలికాం కంపెనీలకు పోటీ ఇస్తోంది. తాజాగా తన వినియోగదారులకు బీఎస్ఎన్ఎల్ శుభవార్త అందించింది.

1 /5

BSNL Offers Double Data: ప్రభుత్వ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగం లిమిటెడ్(BSNL) తన వినియోగదారులకు భారీ ఆఫర్ అందించింది. సరికొత్త ప్లాన్‌ను తీసుకువచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్ వినియోగదారులకు ఇంటర్నెట్ డబుల్ డేటా అందిస్తుంది. ఆ ప్లాన్ వివరాలు మీకోసం.. Also Read: Gold Price Today: బులియన్ మార్కెట్‌లో పుంజుకున్న బంగారం ధరలు, ఆల్‌టైమ్ గరిష్టానికి Silver Price

2 /5

బీఎస్ఎన్ఎల్(BSNL) అత్యంత ప్రజాదరణ పొందిన రీఛార్జ్ ప్లాన్లను అందిస్తోంది. ఈ క్రమంలో మిత్రమ్ ప్లస్ ప్లాన్‌ను ప్రభుత్వం టెలికాం కంపెనీ తీసుకొచ్చింది. టెక్ సైట్ కేరళాటెలికాం ప్రకారం, బీఎస్ఎన్ఎల్ రూ .109 ప్రిపెయిడ్ ప్లాన్ తెచ్చింది. దీని ద్వారా మీకు రెట్టింపు ప్రయోజనాలు లభిస్తాయి. Also Read: BSNL Offers: డబుల్ ధమాకా, రెట్టింపు డేటా అందిస్తున్న బీఎస్ఎన్ఎల్

3 /5

బీఎస్ఎన్ఎల్ అందిస్తున్న 109 రూపాయల మిత్రమ్ ప్లస్ ప్లాన్ వ్యాలిడిటీ పొడిగించారు. గతంలో 30 రోజులుగా ఉన్న వ్యాలిడిటీని ప్రస్తుతం 75 రోజులకు పెంచారు. అంటే ఇది డబుల్ కాదు, రెండున్నర రెట్ల వ్యాలిడిటీని తన వినియోగదారులకు  BSNL అందిస్తుంది.

4 /5

రూ.109తో రీఛార్జ్ చేసుకున్న బీఎస్ఎన్ఎల్ వినియోగదారులకు ఇంటర్నెట్(Internet) డేటా రెట్టింపు అవుతుంది. గతంలో ఈ ప్లాన్‌లో 5GB డేటాను మాత్రమే ఇచ్చేది. ప్రస్తుతం ఈ ప్లాన్ ద్వారా బీఎస్ఎన్ఎల్ వినియోగదారులకు 10 GB డేటాను తీసుకొచ్చింది. Also Read: 7th Pay Commission Latest News: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు Supreme Court శుభవార్త 

5 /5

బీఎస్ఎన్ఎల్ ఇటీవలే తన అన్ని రీఛార్జ్ ప్లాన్లలో అపరిమిత కాలింగ్ సదుపాయాన్ని ప్రారంభించింది. రూ.109 ప్లాన్ కింద అపరిమిత కాలింగ్ సదుపాయాన్ని పొందుతారు. అయితే, 10 జీబీ ప్రమోషనల్ ఆఫర్ వ్యాలిడిటీ 20 రోజులు అని బీఎస్ఎన్ఎల్ స్పష్టం చేసింది. Also Read: Recharge Plans: ఎయిర్‌టెల్, Jio మరియు Vi అందిస్తున్న బెస్ట్ డేటా, కాలింగ్ రీఛార్జ్ ప్లాన్స్ ఇవే