BSNL 200 Days Plan: బీఎస్ఎన్ఎల్ ఇప్పుడు ప్రతి ఇంట్లో ఒక్కరి వద్ద తప్పుకుండా ఉంటుంన్న సిమ్ కార్డు. ఇందులో కళ్లు చెదిరే ఆఫర్లు ఉన్నాయి. దీంతో పెరిగిన టెలికాం ధరల తర్వాత ఎక్కువ శాతం మంది కస్టమర్లు దీనిపై మొగ్గు చూపుతున్నారు. ఈరోజు బీఎస్ఎన్ఎల్ అందిస్తోన్న 200 రోజుల ప్లాన్ వివరాలు తెలుసుకుందాం.
భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ కంపెనీ ఇతర ప్రైవేటు దిగ్గజ కంపెనీలకు బిగ్ షాక్ ఇస్తుంది. అలంటి మరో బంపర్ ప్లాన్ మీ ముందుకు తీసుకువచ్చాం. టెలికాం కంపెనీల ధరలు బాగా పెరగడంతో ఎక్కువ శాతం మంచి బీఎస్ఎన్ఎల్కు పోర్ట్ అయ్యారు.
మరికొందరు రెండో సిమ్ కచ్చితమైన ఆప్షన్ బీఎస్ఎన్ఎల్ ఎంచుకుంటున్నారు. ప్రస్తుతం బీఎస్ఎన్ఎల్ మెరుగైన నెట్‌వర్క్‌తోపాటు ఆకర్షణీయమైన ధరలతో కస్టమర్లను ఆకట్టుకుంటోంది. ఈ ప్రభుత్వ రంగ దిగ్గజ కంపెనీ ఇస్తున్న షాక్‌లకు ప్రైవేటు రంగ కంపెనీలు అయిన జియో, ఎయిర్టెల్, వీఐలు దాదాపు కోటీ కస్టమర్లను పోగొట్టుకున్నాయి.
బీఎస్ఎన్ఎల్ 200 రోజుల వ్యాలిడిటీతో అదిరిపోయే గేమ్ ఛేంజర్ ప్లాన్ తీసుకువచ్చింది. రూ.999 రీఛార్జీ ప్యాక్‌తో అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్ ఏ నెట్వర్క్ అయినా సులభంగా చేయవచ్చు. అంతేకాదు బీఎస్ఎన్ఎల్ రూ.997 ప్లాన్‌తో మరో ప్యాక్‌ను కూడా అందిస్తోంది. ఇందులో ప్రతిరోజూ 2 జీబీ డేటా హై స్పీడ్‌తో పొందుతారు.
ప్రతిరోజూ 100 ఎస్ఎంఎస్లు కూడా ఉచితంగా పొందుతారు. కానీ, ఈ ప్లాన్ కేవలం 160 రోజులపాటు మాత్రమే వర్తిస్తుంది. ఇది కాలింగ్, డేటా సర్వీసులు అందిస్తుంది. ఈ ధరలో ఏ ప్రైవేటు దిగ్గజ కంపెనీలు అందించడం లేదు.
బీఎస్ఎన్ఎల్ 2జీ, 3జీ, 4జీ, 5జీ సేవలను అందిస్తోంది. పెరిగిన టెలికాం ధరలతో కస్టమర్లు చాలా వరకు బీఎస్ఎన్ఎల్కు పోర్ట్ అయిన సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది 5 జీ సేవలను దేశవ్యాప్తంగా విస్తరించే ఆలోచనలో బీఎస్ఎన్ఎల్ ఉంది.