MLC Kavitha Arrested in Delhi Liquor Scam: లోక్‌సభ ఎన్నికల వేళ తెలంగాణలో సంచలన పరిణామం చోటు చేసుకుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్ట్ చేసింది. శుక్రవారం హైదరాబాద్‌లోని కవిత నివాసంలో విచారించిన ఈడీ అధికారులు.. సాయంత్రం అరెస్ట్ చేశారు.
MLC Kavitha Arrested in Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనూహ్య మలుపు తిరిగింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేసిన అధికారులు ఢిల్లీకి తీసుకెళ్లారు. ఈ కేసు విచారణ ప్రస్తుతం సుప్రీం కోర్టులో కొనసాగుతోంది. తదుపరి విచారణ ఈ నెల 19న జరగనుంది. రేపు లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందు అనూహ్యం కవితను అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది.
ఈడీ అరెస్ట్ అనంతరం ఎమ్మెల్యే కవిత అభివాదం చేస్తూ ఇంటి నుంచి బయటకు వచ్చారు. విచారణ సందర్భంగా ఈడీ అధికారులు మొబైల్ ఫోన్స్, కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
ఇంట్లోంచి బయటకు వచ్చే క్రమంలో కవిత పిడికిలి బిగించి అభివాదం చేశారు. కార్యకర్తలకు నమస్కారం చేస్తూ ముందుకు వచ్చారు.
కవిత వెంట కేటీఆర్, హరీశ్ రావు, కేశవరావు తదిరులు ఉన్నారు. కవితను అరెస్ట్ చేసి తీసుకువెళ్తుండగా బీఆర్ఎస్ నేతలు అడ్డుకున్నారు.
తన అరెస్ట్‌పై రేపు సుప్రీం కోర్టులో కవిత పిటిషన్ దాఖలు చేయనున్నారు. మాజీ మంత్రి కేటీఆర్ కూడా ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు.
కవిత అరెస్ట్ నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు సిద్ధమయ్యాయి. రేపు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించనున్నారు.