Africa Food Crisis: కొండచిలువలు నీరు లేకుండా దాదాపు నెల రోజులు పాటు జీవిస్తాయని సైంటిస్టులు పేర్కొన్నారు. ఇవి ప్రతిరోజు ఉదయాన్నే వీటి పొలుసుల మీద ఉన్న నీటి బిందువులనుకూడా తాగి జీవించలగలవని వెల్లడించారు. అదే విధంగా.. ఇవి దాదాపు ఒక సంవత్సరం పాటు ఎలాంటి ఆహారం కూడా తినకుండానే బతుకుతాయని సైంటిస్టులు తెలిపారు.
సాధారణంగా మనలో చాలా మంది పాములు, కొండ చిలువులంటే చచ్చేంత భయపడిపోతుంటారు. అడవులు, భారీగా చెట్లు, కొండల ప్రాంతాల దగ్గర తరచుగా కొండ చిలువలు పాములు కన్పిస్తుంటాయి. కొండ చిలువలు ముఖ్యంగా.. చిన్న జంతువులను తినేస్తుంటాయి. కొన్ని సార్లు మేకలు, కోళ్లు, కుక్కలను కూడా తింటాయి.
ఆఫ్రికా దేశంలో ఇటీవల విపరీతంగా ఆహరం కోరత ఏర్పడింది. దీంతో ప్రజలు కోళ్లు, మేకలను ఎక్కువగా తింటున్నారు. ఇలాంటి సమయంలో కోళ్లు, ఇతర జీవుల సంఖ్య భారీగా తగ్గిపోతుంది. ఈ క్రమంలో తాజాగా సైంటిస్టులు.. ఆగ్నేయాసియాలోని ఒక పొలంలో 12 నెలల పాటు రెటిక్యులేటెడ్, బర్మీస్ అనే రెండు జాతుల పైథాన్ల అధ్యయనం ఆధారంగా ఈ పరిశోధన జరిగింది.
ఈ క్రమంలో.. మాంసాహారం ఎక్కువగా తినడం పర్యావరణానికి హానికరమని పేర్కొన్నారు. కొన్ని అధ్యయనాల ప్రకారం, గొడ్డు మాంసం నుండి కేవలం 100 గ్రాముల ప్రోటీన్ ఉత్పత్తి 49.89 కిలోగ్రాముల కార్బన్ డయాక్సైడ్ విడుదల అవుతుందని సైంటిస్టులు పేర్కొన్నారు. ఇదే క్రమంలో.. పైథాన్ లను తినడం వల్ల పర్యావరణం నష్టం తక్కువగా ఉంటుందని కూడా పేర్కొన్నారు.
అంతర్జాతీయ పరిశోధకుల బృందం అధ్యయనంలో మాట్లాడుతూ.. పైథాన్ మాంసం ప్రస్తుత ఎంపికల కంటే చాలా తక్కువ కార్బన్ ఇంటెన్సివ్ మాంసాన్ని అందించగలదని చెప్పారు. ఆగ్నేయాసియాలోని ఒక పొలంలో 12 నెలల పాటు రెటిక్యులేటెడ్, బర్మీస్ అనే రెండు జాతుల పైథాన్ల అధ్యయనం ఆధారంగా ఈ పరిశోధన జరిగింది.
దీనిలో సైంటిస్టులు.. ప్రతి ఒక్కరూ గొడ్డు మాంసం తినడం మానేసి కొండచిలువలను ఆశ్రయించాలని పేర్కొన్నారు. కొండచిలువలను తినడం వల్ల, ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయని ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ స్నేక్ స్పెషలిస్ట్ గ్రూప్ చైర్ డాక్టర్ నాటుష్ తెలిపారు. ఈ సరీసృపాలు తక్కువ గ్రీన్హౌస్ వాయువులను ఉత్పత్తి చేస్తాయని, తీవ్రమైన వాతావరణ పరిస్థితులకు ఎక్కువ స్థితిస్థాపకంగా ఉంటాయని, బర్డ్ ఫ్లూ లేదా కోవిడ్ -19 వంటి వ్యాధులను ప్రసారం చేయవని పరిశోధకులు తెలిపారు.
ఇవి కరువు సమయంలోను బతుకగలవని సైంటిస్టులు పేర్కొన్నారు. దీనిలో భాగంగా తాజాగా, సైంటిఫిక్ రిపోర్ట్స్ జర్నల్ లో నివేదికను ప్రచురించారు. దీనిలో.. ఒక సంవత్సరం పాటు సాగిన అధ్యయనంలో, ఈ కొండచిలువలకు వారంవారీ ప్రాతిపదికన వివిధ రకాల స్థానికంగా లభించే ఎలుకలు, చేపల ఆహారం అందించారు. రెండు రకాల పైథాన్లు వేగంగా పెరిగాయని తెలిపారు. మగ కొండ చిలువ కంటే ఆడవారు అధిక వృద్ధి రేటును చూపిందన్నారు.